GST: అప్పడాలపై జీఎస్టీ ఎంతో మీకు తెలుసా? పాపడ్ ఆకారాన్ని బట్టి జీఎస్టీ ఉంటుందా? అప్పడాలు.. జీఎస్టీ..మధ్యలో వైరల్ ట్వీట్!

|

Sep 04, 2021 | 8:37 PM

Viral Tweet Fact Check: అప్పడాల రకాలను బట్టి జీ ఎస్టీ విధిస్తారా అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త వ్యంగ్యంగా చేసిన ట్వీట్ కు సీబీఐసీ నిజనిర్ధారణ చేసింది. ఇంతకీ అప్పడాల మీద జీఎస్టీ ఎంతో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే!

GST: అప్పడాలపై జీఎస్టీ ఎంతో మీకు తెలుసా? పాపడ్ ఆకారాన్ని బట్టి జీఎస్టీ ఉంటుందా? అప్పడాలు.. జీఎస్టీ..మధ్యలో వైరల్ ట్వీట్!
Gst
Follow us on

GST: సోషల్ మీడియా.. ఒక్క రాత్రిలో ఎవరినైనా పాప్యులర్ చేస్తుంది. ఒక్క నిమిషంలో ఎవరినైనా పాతాళానికి నెట్టేస్తుంది. వేలిచివర నుంచి ఒక్క బటన్ నొక్కితే.. వేలాది ఇంకా చెప్పాలంటే లక్షలాది మంది ముంగిట మన ఆలోచన లేదా ఆవేదన ప్రత్యక్షం అయిపోతుంది. గతంలో మనకు ఏదైనా సందేహం.. ముఖ్యంగా ప్రభుత్వ సేవలకు సంబంధించి వస్తే వాటిని తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలీక తలలు బద్దలు కొట్టుకునేవాళ్ళం. తీరా తిప్పలు పడి అక్కడకు వెళ్లి మన సందేహం నివృత్తి చేసుకుందామంటే.. దానికి సమాధానం చెప్పేవారే కరువైపోయేవారు. సందేహం తీరడం మాట అటుంచి అనవసరమైన అలుపుతో ఆయాసం వచ్చేది. కానీ, సోషల్ మీడియా విప్లవం మామూలుది కాదు. ఇప్పుడు మీరు ఏదైనా సందేహం వస్తే.. వెంటనే ఒక్క ట్వీట్ చేయండి.. దానికి సంబంధిత ట్యాగ్ జాగ్రత్తగా ఇవ్వండి. అంతే, మీ సందేహానికి సమాధానం వెంటనే దొరికిపోతుంది. ఏమిటీ ఇదంతా అనుకుంటున్నారా? అయితే, ఈ చిన్న అప్పడాల కథ చదవండి. మీరు మేము చెప్పినదానికి నిజమే అని ఒప్పుకుంటారు.

అప్పడాలు.. జీఎస్టీ ఈ రెండిటికీ మధ్య సంబంధం పై ఒక పారిశ్రామిక వేత్తకు చిన్న అనుమానం వచ్చింది. అంతే! ఆయన ట్విట్టర్ లో తన సందేహాన్ని లేవనెత్తుతూ ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టారు. గతంలో అయితే, ఇటువంటి ట్వీట్ లకు నెటిజన్లు స్పందించి దానిపై కామెంట్స్ చేశేవారు. ఈ ట్వీట్ కు కూడా అదే జరిగింది. వైరల్ గా మారింది. కానీ.. ఈ ట్వీట్ పై ఒక ప్రభుత్వ సంస్థ స్పందించింది. ఆయన సందేహంలో నిజమెంతో చెబుతూ ఒక ట్వీట్ చేసింది. దీంతో ట్విట్టర్ లో ఈ రెండు ట్వీట్ లు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.
ఇంతకీ హర్ష్ గోయెంకా ట్వీట్ ఏమిటంటే..

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా మంగళవారం పాపడ్ (అప్పడాలు) పై జీఎస్టీ గురించి ఒక ట్వీట్ చేశారు. అందులో గుండ్రని అప్పడాలు ఒక పక్క.. నాలుగు పలకలుగా ఉన్న అప్పడాలు ఒకపక్క పెట్టి “ఒక రౌండ్ పాపడ్ కు జీఎస్టీ ఉండదు. అలాగే ఒక చదరపు పాపడ్ జీఎస్టీ విధిస్తారని మీకు తెలుసా? నాకు లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్‌ని ఎవరైనా సూచించగలరా? ” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది ట్రెండింగ్ గా మారింది. చాలా మంది ఈ ట్వీట్ పై.. జీఎస్టీ విధానాన్ని వెక్కిరిస్తూ కామెంట్స్ కూడా పెట్టారు.
అయితే, ఈ ట్వీట్ పై అనూహ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ వేగంగా స్పందించింది. దీనిపై వాస్తవాలను వివరిస్తూ హార్ష్ గోయెంకా ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. దీనిలో “పాపడ్, గుండ్రంగా లేదా నాలుగు పలకలుగా.. ఏ రకంగా ఉన్నా సరే.. GST నోటిఫికేషన్ నెం .26/2017-CT (R) లోని GST నంబర్ 96 ద్వారా మినహాయింపు పొందింది. ఈ మినహాయింపు అప్పడం ఆకారాన్ని బట్టి మారదు.” అని చెప్పింది. అంతేకాదు.. ఈ సమాచారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని కూడా ఆ ట్వీట్ లో పేర్కొంది.
ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు..

నిజానికి హర్ష గోయెంకా ఈ విషయంలో కొద్దిగా పొరపాటు పడినట్టు కనిపిస్తోంది. తనకు అందిన సమాచారాన్ని సరిచూసుకోకుండా ఆయన అప్పదాలకు సంబంధించిన జీఎస్టీ పై స్పందించారు. అయితే, దీనివలన మన ప్రభుత్వ విభాగాలు చాలా చురకుగా ఉన్నట్టు రుజువైంది. మొత్తమ్మీద అప్పడాలపై జీఎస్టీ లేదు అనే విషయం చాలా మందికి తెలిసింది. ఎందుకంటే, సాధారణంగా జీఎస్టీ మినహాయింపు పొందిన వస్తువుల గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదనేది నిజం.

Also Read: మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Viral Video: కరెన్సీ నోట్లను దొంగిలిస్తున్న కాకి..! వీడియో చూసి పరేషాన్ అవుతున్న నెటిజన్లు..