Harsh Goenka: కోహినూర్ డైమండ్ కోసం ‘కిడ్నాప్’ ప్లాన్.. రచ్చ చేస్తున్న వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్..

|

Oct 27, 2022 | 3:29 PM

బ్రిటన్‌కు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. బ్రిటన్‌లో ఉన్న కోహినూర్‌ డైమండ్‌కు భారత్‌కు తరలించడానికి ఇదే మంచి తరుణమని చాలామంది

Harsh Goenka: కోహినూర్ డైమండ్ కోసం ‘కిడ్నాప్’ ప్లాన్.. రచ్చ చేస్తున్న వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్..
Harsh Goenka
Follow us on

బ్రిటన్‌కు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. బ్రిటన్‌లో ఉన్న కోహినూర్‌ డైమండ్‌కు భారత్‌కు తరలించడానికి ఇదే మంచి తరుణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవును, కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు తన స్నేహితుడు ఓ ఐడియా ఇచ్చారంటూ ట్వీట్‌ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా. ముందుగా రిషి సునాక్‌ను భారత్‌కు రప్పించి, బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఆయన్ను కిడ్నాప్ చేసి.. రిషి స్థానంలో నెహ్రాను ఇంగ్లాండ్ ప్రధానిగా పంపాలని సూచించారు. ‘‘ఆ తేడా ఎవరూ గమనించలేరు.. కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి రప్పించే బిల్లును ఆమోదించమని నెహ్రాకు సూచించాలి’’ అని తన స్నేహితుడు సూచించినట్టు హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ చేశారు. అలా చేస్తే వెంటనే ఆ వజ్రం భారత్‌కు చేరుకుంటుందని అర్థం వచ్చేలా ఎమోజీలను గోయెంకా షేర్‌ చేశారు.

హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గోయెంకా ఐడియా అదిరిపోయింది కానీ, ప్లాన్ ముందే చెప్పేశారని , మరో ప్లాన్ వేయాల్సిందేనంటూ నెటిజన్లు జోక్స్ పేల్చుతున్నారు. ‘అయ్యో.. మీరు ప్లాన్‌ అంతా చెప్పేశారు సర్.. ఇంకో ప్లాన్ వేయాల్సిందే’, ‘ బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న తర్వాత కిడ్నాప్‌ అవసరం లేదు. ఆయన అందులో నుంచి బయటపడేసరికి, మన మిషన్ పూర్తవుతుంది’, ‘ఇప్పుడు నెహ్రా బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు..?’ ‘హృతిక్ రోషన్‌ను ఇంగ్లాండ్‌లో సెక్యూరిటీ హెడ్‌గా నియమిస్తే సరి’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెట్టారు.

ఇవి కూడా చదవండి

హర్ష్ గోయెంకా ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..