వావ్ ఏం ఐడియా బ్రో.. క్యూ లేదు, టైమ్ టెన్షన్ లేదు.. 5సెకన్లలోనే అద్దిరిపోయే కట్టింగ్…
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది మగవాళ్లు బార్బర్ షాపులకు క్యూ కడుతుంటారు. కానీ, అక్కడి క్యూ లైన్లు చూస్తే రోజంతా అక్కడే గడిచిపోయేలా ఉంటాయి. వారానికి దొరికే ఒక్కరోజు సెలవు కాస్త కట్టింగ్ కోసం కేటాయించాల్సి వస్తుందని అనేక మంది ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు మీకు టెన్షన్ లేదు.. క్యూలోనే నిలబడాల్సిన అవసరం అసలే లేదు... ఒక్క ఫోటో క్లిక్ చేసినంత సమయంలోనే మీకు నచ్చిన హెయిర్ స్టైల్ చేసే వెసిలిటీ ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. అదేలాగో ఈ వీడియోలో చూడాల్సిందే..

మీలో చాలామంది నెలకు కనీసం ఒక్కసారైనా సెలూన్‌కి వెళ్లి ఉంటారు. పెరిగిన గడ్డాన్ని కత్తిరించడానికి మార్కెట్లో చాలా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో సెలూన్‌కి వెళ్లే ఇబ్బంది లేదు. ఈ యంత్రం సహాయంతో ఇంట్లోనే గడ్డాన్ని ఈజీగా తీసేసుకుంటారు. కానీ జుట్టు కత్తిరించే విషయానికి వస్తే, తప్పనిసరిగా సెలూన్‌కి వెళ్లాల్సిందే. స్వయంగా హెయిర్ కట్ చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు..మన ఇళ్లలోకి కూడా ఎవరికీ ఆ పని వచ్చి ఉండదు. చాలామంది పెరిగిన జుట్టును కత్తిరించుకోవడానికి, లేదంటే, సెట్ చేసుకోవడానికి సెలూన్‌కి వెళతారు. కానీ, అక్కడి క్యూ లైన్లు చూస్తే ఒక్కోసారి ఏడుపు వచ్చేలా ఉంటాయి. రోజంతా బార్బర్ షాపుకు అంకితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుంది.
కానీ, మీరు నిలబడిన చోటనే ఎలాంటి క్యూ లైన్ లేకుండా క్షణాల్లో మీకు నచ్చిన హెయిర్ కట్ పూర్తైతే ఎలా ఉంటుందో కదా..? అవును అలాంటిదే, ఒక ప్రత్యేకమైన హెయిర్ కటింగ్ మెషిన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన తలను ఆ మెషిన్‌లో ఉంచిన కొన్ని సెకన్లలోనే పర్ఫెక్ట్ హెయిర్ కట్టింగ్ పూర్తవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అలాంటి మెషిన్ నిజంగా అందుబాటులో ఉందా? అని అడుగుతున్నారు.
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి పొడవాటి జుట్టుతో ఈ హెయిర్ కట్టింగ్ తో ఒక ప్రత్యేకమైన మెషీన్ వద్ద నిలబడి ఉన్నాడు. చూసేందుకు ఆ యంత్రం పాతకాలం నాటి ఫోటో కెమెరాలాగా కనిపిస్తుంది. అతడు తన తలను ఆ యంత్రం లోపలికి దూర్చాడు. అంతే.. ఫోటో క్లిక్‌మనిపించినంత సమయంలోనే, కొన్ని సెకన్లలో అతనికి అందమైన హెయిర్ స్టైల్ పూర్తైంది. అతను తన తలని యంత్రం లోపల పెట్టే ముందు ఇలా చెబుతున్నాడు. మీరు ATM నుండి డబ్బు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు. ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు వంటి సమాచారాన్ని పూరించాలి.. ఆ తర్వాత, యంత్రం మీకు డబ్బు ఇస్తుంది. ఈ యంత్రం కూడా అదే విధంగా పనిచేస్తుందని చెబుతున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
ये भविष्य में जल्द ही मार्केट में आने वाली ” हेयर कटिंग मशीन” है।
जो सिर्फ मात्र 5 सेकंड में ही आपके बालों को परफेक्ट काट देगी। pic.twitter.com/V05bLWs0x5
— Dr. Sheetal yadav (@Sheetal2242) November 6, 2025
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ 10 సెకన్ల వీడియోను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తున్నారు. ఈ వీడియోను @Sheetal2242 అనే అనామక ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఇది భవిష్యత్తులో త్వరగా అందుబాటులోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.హెయిర్ కటింగ్ మెషిన్.. ఇది మీకు కేవలం 5 సెకన్లలో పర్ఫెక్ట్ కట్ ఇస్తుంది.. అని రాశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 141,000 మందికి పైగా వీక్షించారు. ప్రతి ఒక్కరూ వీడియోపై కామెంట్ చేశారు. భవిష్యత్తులో ఇది వచ్చినా, దాంతో హెయిర్ కట్‌ను ఎవరు రిస్క్ చేస్తారు? మీరు అనుకోకుండా మీ చెవులు, ముక్కు లేదా గొంతు కోసుకుంటే? ఎవరిది బాధ్యత అంటున్నారు కొందరు. భవిష్యత్తులో బార్బర్లకు కష్టలు తప్పేలా లేవని మరికొందరు రాశారు. అలాగే, చాలా మంది ఇది నిజమేనా అనే సందేహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




