Viral Video: నిర్లక్ష్యానికి నిదర్శనం.. ఇంత చెత్త రోడ్లని ఏ దేశంలో చూడలేదన్న విదేశీ వనిత..

ఓ వైపు భారత దేశం సంస్కృతి సంప్రదాయాలతో విదేశీయులను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రజలు, అధికారుల నిర్లక్షంతో భారతదేశాన్ని విదేశీయుల ముందు సిగ్గుపడే స్థితికి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి మోడీ దేశంలో స్వచ్ఛ భారతదేశం అనే భావనను తీసుకువచ్చారు. అయితే ఎవరూ స్వచ్చ భారతం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. శుభ్రం ఉండడం వలన కలిగే లాభాలను చెబుతున్నారు. పరిశుభ్రంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరూ దీనిని వినడం లేదు. ఈ నిర్లక్షమే ఇప్పుడు విదేశీయుల ముందు తలవంచేలా చేసింది. కారణం ఏమిటంటే..

Viral Video: నిర్లక్ష్యానికి నిదర్శనం.. ఇంత చెత్త రోడ్లని ఏ దేశంలో చూడలేదన్న విదేశీ వనిత..
Viral Video Dirty Gurgaon

Updated on: Jul 09, 2025 | 8:27 PM

భారతదేశం (గుర్గావ్‌లో పరిశుభ్రత) గురించి విదేశీయులకు మంచి అభిప్రాయం ఉంది. విదేశీయులకు భారతీయ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, ఆచారాల పట్ల అపారమైన గౌరవం ఉంది. వీరు ఎక్కడికి వెళ్ళినా భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశం కొంతవరకు సురక్షితంగా ఉంటుందని కూడా వారికి తెలుసు. అయితే మనం చేసే కొన్ని పనుల వలన ఎలాంటి గౌరవం లభిస్తుందో తెలుసా..

భారతదేశ ప్రజలు పరిశుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. భారత ప్రధాన మంత్రి మోడీ స్వచ్ఛ భారత్ ప్రచారం ద్వారా అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పరిశుభ్రత అనే మాటని గాలికొదిలేశారు. ఇది చూసిన అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశం చెత్తతో ఎలా నిండిపోయిందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఒక ఫ్రెంచ్ పర్యాటకుడు షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక వీధిలో చెత్త వ్యాపించి ఉండటం చూసి ఈ విదేశీ మహిళ భయపడింది. భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ మహిళ మాథిల్డే.. తాను ఇప్పటి వరకూ సందర్శించిన ఏ దేశంలోనూ ఇంత మురికిని ఎప్పుడూ చూడలేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

కొన్ని యూరోపియన్ దేశాలు పరిశుభ్రత, మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలోని దేశాలు కూడా భారతదేశం కంటే 100 రెట్లు శుభ్రంగా ఉన్నాయని ఆ మహిళ చెప్పింది. “నేను ఇక్కడ చూసిన దృశ్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.. స్కూల్ కి ముందున్న మొత్తం రహదారి చెత్త కుప్పలతో నిండి ఉంది” అని చెబుతూ ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. గుర్గావ్‌లోని ఒక ఫ్రెంచ్ పర్యాటకుడు తీవ్ర విమర్శలు చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నగర పరిస్థితిని చూసి తాను భయపడుతున్నానని అన్నది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ నగరం వాస్తవ పరిస్థితిని చూసి తాను భయపడుతున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకూ తాను సందర్శించిన ఏ దేశంలోనూ ఇంత ధూళి, చెత్త, చెడు రోడ్లను చూడలేదు అని తన X ఖాతాలో పేర్కొంది. ఇది చాలా భారతీయుల బద్దకనికి నిదర్శనంగా నిలుస్తుంది. చాలా విచారకరమైన విషయం అని చెప్పింది. అయితే ఈ నగరానికి సమీపంలో డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ నిర్మిస్తామని హర్యానా ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో ఈ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీని గురించి ఆమె ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..