కుక్కలు డ్యాన్స్ చేయం మనం చూశాం. శిక్షణ తరువాత అవి వివిధ సాహసకృత్యాలను చేయడం కూడా చూశాం. పెంపుడు కుక్కలు యజమానులతో కలిసి చేసే అల్లరి కూడా చూశాం. ఇలాంటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. కానీ ఈ కుక్క మాత్రం ఆ టైపు కాదు.. మరో టైపు తనకు ఏదైన టార్గెట్ పెడితే అంతే ప్రపంచ రికార్డు సృష్టంచడమే.. అదే చేసింది ఈ బుజ్జి కుక్క ఓ ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో బెలూన్లను పగులగొట్టింది.
కానీ ట్వింకి అనే కుక్క బెలూన్లను అత్యంత వేగంగా పగలగొట్టి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 39.08 సెకన్లలో 100 బెలూన్లను పగులగొట్టింది. ట్వింకి జాక్ రస్సెల్ ఓ టెర్రియర్ జాతి కుక్క. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో గొప్ప రికార్డును సొంతం చేసుకుంది. మెరుపు వేగంతో బెలూన్లు పగిలిపోతున్న తీరు అందరిని ఆకట్టుకుంది.
2016లో ఇదే రికార్డు ట్వింకి తల్లి అనస్తాసియా పేరుతో ఉంది. తన తల్లి పేరుతో ఉన్న రికార్డును ట్వింకి బ్రేక్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం, కెనడాలో నివసిస్తున్న క్రిస్టీ స్ప్రింగ్స్ డాగీ టోబి 28.22 సెకన్లలో 100 బెలూన్లను పేల్చి ఈ రికార్డు సృష్టించింది. మనుషులతో పాటు జంతువుల రికార్డులు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చాలా ఉన్నాయి.