Wedding Video: ఈ వెడ్డింగ్ మరీ కాస్ట్ లీ గురూ.. కరెన్సీ నోట్లతో నేలను తాకేలా నగదు మాల.. ఎక్కడో తెలుసా?

|

Oct 23, 2022 | 9:54 AM

సాధారణంగా వధువులను మల్లెపూలు, సెవంతి, సందు, చందు, కనకాంబర, గులాబీ తదితర పూల మాలలతో అలంకరిస్తారు. అయితే ఒక పెళ్లి వేడుకలో భారీ నోట్ల కట్టలతో వరుడిని ముస్తాబు చేశారు.

Wedding Video: ఈ వెడ్డింగ్ మరీ కాస్ట్ లీ గురూ.. కరెన్సీ నోట్లతో నేలను తాకేలా నగదు మాల.. ఎక్కడో తెలుసా?
Cash Garland
Follow us on

పెళ్లి వేడుకలు అంటే హంగులు, ఆర్భాటాలు, ఆడంబరాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. వధూవరుల ముస్తాబు నుంచి విందుల దాకా తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు చాలామంది. ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య కాలంలో వివాహ వేడుక‌ల్లో వ‌ధూవ‌రుల‌కు వారి స్నేహితులు, బంధువులు అందిస్తున్న కానుక‌లు, బ‌హుమ‌తులు తెగ వైర‌ల్ గా మారుతున్నాయి. సాధారణంగా వధువులను మల్లెపూలు, సెవంతి, సందు, చందు, కనకాంబర, గులాబీ తదితర పూల మాలలతో అలంకరిస్తారు. అయితే ఒక పెళ్లి వేడుకలో భారీ నోట్ల కట్టలతో వరుడిని ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇన్ స్ట్రాగ్రామ్ షేర్ చేసిన వీడియో దృశ్యాల్లో వివాహ వేడుకలో వరుడు తన స్నేహితులతో కలిసి నిల్చున్నాడు. అదే సమయంలో అత‌ని స్నేహితులు క‌రెన్సీ నోట్లతో తయారుచేసిన చేసిన భారీ న‌గ‌దు మాల‌ను వ‌రుడి మెడలో అలంకరించారు. బరువుగా ఉందేమో ఏకంగా నగదు మాలను ఏకంగా ఐదారు మంది ప‌ట్టుకుని వచ్చారు. ఇక వరుడు వేసుకోగానే అది నేలకు తాకుతూ కనిపించడం గమనార్హం.

ఇంత ఆడంబరం అవసరమా?

కాగా ఈ ఆడంబరమైన పెళ్లి వేడుక పాకిస్థాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 6న సోషల్ మీడియాలో ఈ వీడియో దర్శనమిచ్చింది. ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. కాగా గతంలో మనదేశంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలు, ఇతర పండగలు, పర్వదినాల సమయాల్లో దేవుళ్ల మెడలో నోట్ల కట్టలు వేయడం మనం చూసే ఉంటాం. అయితే ఇలా చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. బ్యాంకు నోట్లు సార్వభౌమాధికారానికి చిహ్నమని, వాటిని గౌరవించాలనీ, ప్రజలు వాటిని దుర్వినియోగం చేయకూడదని కొన్నేళ్ల క్రితం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేలాది మంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంత ఆడంబరం అవసరమా అని కొందరు నెటిజన్లు వరుడిపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..