టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!
ఇటీవల ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఇటీవల ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది చూస్తే మీరు కచ్చితంగా భయంతో వణికిపోతారు. ఈ వీడియోలో వేగంగా వెళ్తున్న ఓ కారు.. టోల్ బూత్ వద్ద ఉన్న డివైడర్‌ను చాలా వేగంగా ఢీ కొట్టింది. దెబ్బకు కారు ఎగిరిపడింది. అదే సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా చాలా వేగంగా కారు అద్దాలు పగలగొట్టుకుని బలంగా రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. టోల్ బూత్ డివైడర్‌ను కారు వేగంగా ఢీకొట్టడం, కారులో మంటలు రావడం, కారు డ్రైవర్ దూకి పడిపోవడం వంటివన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేక చనిపోయాడా అనేది కచ్చితంగా తెలియనప్పటికీ.. ఇది చాలా భయంకరమైన ప్రమాదంగా చెప్పవచ్చు. వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు వేలాదిమంది వీక్షించగా.. వందల్లో లైక్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రుతి !!
Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

