Viral: మావ నువ్వు సింగిలా..? ఇక చింత ఏల.. ఇదిగో గర్ల్‌ప్రెండ్.. బట్
ఏంది మావ ఇంకా ఎన్నాళ్లు సింగిల్ ఉంటారు.. ముఖ్యంగా నైన్టీస్ కిడ్స్.. ఇక సంకెళ్లు తెంపుకునే టైం వచ్చేసింది. మీకు కూడా ఓ గర్ల్‌ప్రెండ్ ఉందని.. డేట్‌కి వెళ్లామని ప్రపంచానికి చెప్పుకోవాలని ఉందా..? అయితే ఇంతకంటే బెటర్ ఆఫర్ ఉండదు.. ఇంకెందుకు ఆలస్యం......

మీరు సింగిలా..? మింగిల్ అయ్యేంత టాలెంట్ మీలో లేదా..? మాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి మురిసిపోవాలని ఉందా..? అయితే మీకే ఈ బంపరాఫర్. తాను రెడీ అంటూ ఈ ఢిల్లీ అమ్మాయి సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే అద్దె మాత్రం చెల్లించాలని కండీషన్ పెట్టింది. ఇళ్లు, కార్లు, ఆఫీసులు, ఫర్నీచర్ వంటి వస్తువులు అద్దెకు దొరుకుతాయని విన్నాం కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకునే ఆఫర్ మీరెక్కడా విని ఉండరు. ఇన్ స్టాలో ఈ యువతి పేరు దివ్యగా ఉంది. కాఫీ డేట్ నుంచి.. వీకెండ్ గెట్ఎవే వరకు ప్రత్యేకంగా రేట్లు పెట్టింది. దివ్య ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చేసి తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఈ రీల్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె బయో ప్రకారం, దక్షిణ ఢిల్లీగా తెలిసింది. ఓన్లీ వెజ్ మాత్రం తింటానని వెల్లడించింది. దివ్య సోషల్ మీడియాలో రేట్ కార్డ్‌ను షేర్ చేసి, “నన్ను ఒక రోజు అద్దెకు తీసుకోండి. మనం కలిసి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకుందాం!” అని పేర్కొంది.
వీడియో దిగువన చూడండి
View this post on Instagram
వైరల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ 15,000కి పైగా లైక్‌లు వచ్చాయి. యూజర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో డేట్ రేట్ కార్డ్‌ను అప్‌లోడ్ చేస్తున్న అమ్మాయిని చాలామంది తిడుతున్నారు. “సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఇంత కంటే మంచి ప్లాన్ దొరకలేదా?” అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘మీరు మన దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. ఒక్కసారి మీరు వచ్చిన రూట్స్ గురించి ఆలోచించండి’ అని మరొకరు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
