Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. అమ్మాయిని అమాంతం ఎగరేశాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి.. అబ్బాయి భుజంపై చేయి వేసి ఫీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. అమ్మాయిని అమాంతం ఎగరేశాడు..! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Girl Stunt Video
Follow us

|

Updated on: Jul 06, 2022 | 3:22 PM

Girl Stunt Video: సోషల్ మీడియా ప్రపంచంలోని నిత్యం స్టంట్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ విన్యాసాలు కొన్ని అద్భుతంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా మారుతాయి. వాస్తవానికి స్టంట్లను చేస్తే.. వారు ఎలా చేశారన్నది ఆశ్యర్యం కలిగిస్తుంది. కొన్ని వీడియోలను చూసిన తర్వాత నెటిజన్లు అచ్చం హీరోలా చేశారంటూ ప్రశంసిస్తారు. అదే సమయంలో కొన్ని వీడియోలు చూసిన తర్వాత స్టంట్ చేసిన వారిపై జాలి కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి.. అబ్బాయి భుజంపై చేయి వేసి ఫీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరుక్షణం దిమ్మతిరిగే ట్విస్ట్ జరుగుతుంది. ఇది చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు అమ్మో అంటూ బాధపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అయిన 7 సెకన్ల వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చూసి అందరూ జాలి పడతున్నారు. క్లిప్‌లో, పెరట్లో ఒక అబ్బాయి, అమ్మాయి ఫీట్ చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. అప్పుడు అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయి భుజంపై చేయి వేసి ఒక్కసారిగా దూకుతుంది. అలా వచ్చిరాగానే అమ్మాయిని.. యువకుడు చేతులతో పైకి లేపి పట్టుకోవాలి. కాని అలా జరుగదు. ఆ అబ్బాయి బ్యాలెన్స్ తప్పడంతో.. యువతి ఒక్కసారిగా కిందపడుతుంది. అమ్మాయి తల నేరుగా నేలకు తాకడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ అమ్మాయికి గాయం అయినట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

స్టంట్ వీడియో చూడండి..

అమ్మాయి స్టంట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో Funny Fail Videos అనే యూజర్ షేర్ చేసింది. ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటినుంచి వేలాది మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాలని.. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్