పాములకు సంబంధించిన అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. సరీసృపాలు ఏం చేసినా.. అదొక ట్రెండ్ అనమాట. అన్ని ఇంటర్నెట్‌లో దర్శనమిస్తాయి. కొద్దిరోజుల క్రితం పుత్తూరుకు చెందిన ఓ మహిళ తన ఒట్టి చేతులతో భారీ కొండచిలువను పట్టుకున్న వీడియో మనం చూసే ఉన్నాం. ఇప్పుడు పైథాన్‌కు సంబంధించి మరో వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మైసూరులోని హెచ్‌డి కోటే అటవీ ప్రాంతం సమీపాన ఉన్న నది దగ్గర ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. ఆ కొండచిలువ పెద్ద చెట్టు చుట్టూ చుట్టుకుని పాకుతున్న దృశ్యాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇక అక్కడే ఉన్న కొందరు ఈ వీడియోను తీయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇంత పెద్ద కొండచిలువను ఎక్కడా చూడలేదు’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ‘పాములను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడే అవి మనల్ని ఏం చేయవు’ అని మరికొందరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..