Watch Video: కుందేలును అమాంతం మింగేసిన 20 అడుగుల భారీ పైథాన్‌.. ఒళ్లు దలజరించే వీడియో..

ఒక జీవికి ఆకలి వేస్తే మరో జీవికి ఆయువు తీరాల్సిందే' పుష్ప సినిమాలోని పాటలో వచ్చే ఈ లిరిక్ అక్షర సత్యం. సృష్టి ధర్మం కూడా ఇదే. ఒక జీవి బతకాలంటే దానికి మరో జీవి ఆహారంగా మారుతుంది. మరీ ముఖ్యంగా అడవుల్లో ఇది సర్వ సాధారణం...

Watch Video: కుందేలును అమాంతం మింగేసిన 20 అడుగుల భారీ పైథాన్‌.. ఒళ్లు దలజరించే వీడియో..
Representative Image
Follow us

|

Updated on: Nov 08, 2022 | 7:50 PM

‘ఒక జీవికి ఆకలి వేస్తే మరో జీవికి ఆయువు తీరాల్సిందే’ పుష్ప సినిమాలోని పాటలో వచ్చే ఈ లిరిక్ అక్షర సత్యం. సృష్టి ధర్మం కూడా ఇదే. ఒక జీవి బతకాలంటే దానికి మరో జీవి ఆహారంగా మారుతుంది. మరీ ముఖ్యంగా అడవుల్లో ఇది సర్వ సాధారణం. అందుకే ఒక జీవిపై మరో జీవి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జీవుల మధ్య సాగే ఈ పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి.

కొండ చిలువలు ఇతర జీవాలను అమాంతం మింగేసే వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓ జంతు ప్రదర్శనశాలలో 20 అడుగులు భారీ పైథాన్‌ సేదతీరుతోంది. దాని కేర్‌ టేకర్‌ పైథాన్‌ కోసం కుందేలును ఆహారంగా తీసుకొచ్చాడు. పైథాన్‌కు దగ్గరగా తీసుకొచ్చే సరికి వెంటనే అమాంతం మింగేసింది.

ఇవి కూడా చదవండి

దీనంతటినీ వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ప్రముఖ ఎనిమల్‌ అడ్వేంచర్‌ వీడియో క్రియేటర్‌ స్నేక్‌బైట్‌ టీవీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఇక ఈ వీడియో నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుంటుందో దానికి ఇచ్చిన క్యాప్షన్‌ కూడా అట్రాక్ట్ చేస్తోంది. ‘పైథాన్‌ దాని ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ వీడియో కొందరినీ ఇబ్బందికి గురి చేయొచ్చు. కానీ ఇది ప్రకృతి ధర్మం’ అనే క్యాప్షన్‌ ఇదంతా నిజమేకదా అనే భావన కలిగిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..