Giant Egg Roll:సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమి జరిగినా వెంటనే అందరి వద్దకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ (Food Lovers)కోసం డిఫరెంట్ ఫుడ్స్ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా స్ట్రీట్ ఫుడ్ (Street Food)లవర్స్ కోసం ఓ భారీ స్నాక్ ఐటెం వీడియో ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 30 గుడ్లతో తయారు చేసిన అత్యంత భారీ ఎగ్ రోల్. ఈ వీడియోలోని ఎగ్ రోల్ చాలా మంది నెటిజన్లను ఆకర్షించింది. ఎగ్ రోల్ సైజ్, తయారీ చేసిన విధానానికి ఫిదా అయ్యారు. రకరకాల ఎమోజీలతో తమ ఇష్టాన్ని తెలియజేస్తున్నారు.
ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని బ్రహ్మపుత్ర మార్కెట్‌లో చిత్రీకరించబడింది. ఎగ్ రోల్‌ను సిద్ధం చేసేందుకు ఒక వ్యక్తి మొదట.. పెనం మీద కొంచెం నూనె వేసి.. తర్వాత కట్ చేసిన కూరగాయల ముక్కలతో పాటు ఉప్పు, కారం , సాస్ వేసి స్టఫ్ ను తాయారు చేశాడు. అనంతరం కొన్ని చపాతీ పిండి ఉండలను తీసుకుని తీసుకుని, దానిని ఒకదానిపై ఒకటిగా వేసి.. పెద్ద చపాతీలా ఒత్తాడు. ఆ పెద్ద చపాతీని మళ్ళీ పెనం మీద వేసి.. వేయించాడు. తర్వాత దానిపై దాదాపు 30 గుడ్ల వేసి.. ఆమ్లెట్ గా వేయించి.. అప్పుడు ఆ ఆమ్లెట్ పై కూరగాయల స్టఫ్ ను మరికొన్ని కొన్ని ఉల్లిపాయల ముక్కలను వేసి.. ఎగ్ రోల్ ను తయారు చేశాడు. ఈ వీడియో “30 గుడ్లు రోల్. దీన్ని ఒంటరిగా పూర్తి చేయగల వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అనేక మంది హృదయాలను దోచుకుంది. హార్ట్ ఎమోజీలతో తమ లవ్ ని తెలియజేస్తున్నారు ఫుడ్ లవర్స్.
జెయింట్ ఎగ్ రోల్ తయారీని ఇక్కడ చూడండి:
జనవరి 9 న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ వీడియో 3.2 లక్షలకు పైగా లైక్‌లను పొందింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని అమితంగా ఆకర్షించింది.