Viral Video: ద్యావుడా.. ఇదేక్కడి పార్కింగ్ రా బాబు.. కారును ఎలా పార్క్ చేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

Shocking Video: కాలినడకన వెళ్లేవారు, కారులో వెళ్లేవారు లేదా బైక్‌పై వెళ్లేవారు.. ఎవరైనా రోడ్డు నియమాలు పాటించాల్సిందే. ట్రాఫిక్‌ నియమాలు అనుసరించాల్సిందే. లేకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. ముఖ్యంగా కారులో వెళ్లేవారు మరింత జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలి..

Viral Video: ద్యావుడా.. ఇదేక్కడి పార్కింగ్ రా బాబు.. కారును ఎలా పార్క్ చేశాడో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Car Accident

Updated on: Aug 10, 2022 | 5:37 PM

Shocking Video: కాలినడకన వెళ్లేవారు, కారులో వెళ్లేవారు లేదా బైక్‌పై వెళ్లేవారు.. ఎవరైనా రోడ్డు నియమాలు పాటించాల్సిందే. ట్రాఫిక్‌ నియమాలు అనుసరించాల్సిందే. లేకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. ముఖ్యంగా కారులో వెళ్లేవారు మరింత జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలి. తమ వాహనం వల్ల మరెవరికీ ప్రమాదం కలగకుండా కారును నడపాలి. అయితే కొంతమంది చాలా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి చాలా గగుర్బాటును, భయోత్పాతాన్ని కలిగిసత్ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ తనతో పాటు మరికొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేస్తాడు.

రోడ్డు పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో నాలుగు కార్లు పార్క్ చేసి, వాటి మధ్యలో ఒక కారు పార్కింగ్ చేయడానికి స్థలం మిగిలి ఉండడం ఈ వైరల్‌ వీడియోలో చూడవచ్చు. అయితే అప్పుడే వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి వాటిని ఢీకొట్టడంతో అది గాలిలోకి ఎగిరి నేరుగా పార్కింగ్‌ ప్లేస్‌లోకి పడిపోతుంది. ఈ షాకింగ్ సంఘటనలో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత కారు డ్రైవర్ హాయిగా కారు దిగి ముందుకు వెళ్లిపోతాడు. వీడియో చూస్తుంటే సరైన స్థలంలో తన కారును పార్క్ చేసి కారు దిగి సరదాగా వాకింగ్‌కు వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియో GTA MEMES అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కేవలం 25 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 60 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కొందరు ‘గ్రేట్ పార్కింగ్’ అని సరదాగా అంటుంటే మరికొందరు కారు పార్క్ చేయడంలో ఇది సూపర్ స్కిల్ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..