ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. ఫోన్‌కు అడిక్ట్ అయినవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలోని చిన్నపిల్లలు గంటల తరబడి ఫోన్ చూస్తుంటారు. గేమ్స్ ఆడడం.. వీడియోస్ చూడడం .. చాలా సులభంగా ఫోన్ ఉపయోగించేస్తున్నారు. అయితే చాలా మంది పిల్లలు ఫోన్ వదిలి పెట్టాలంటే మారాం చేస్తుంటారు. ఫోన్ లాక్కుంటే గుక్కపెట్టి ఏడుస్తారు. మరికొందరు తల్లిదండ్రులపై కోపం చూపిస్తారు. కానీ మొబైల్స్‌కు జంతువులు అడిక్ట్ కావడం చూశారా ?. చరజీవులు అంటే కప్పలు ఫోన్లకు బానిసలు కావడం. ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేస్తే తాట తీస్తున్నాయి. క్యూ లైన్లో ఉండిమరీ ధీర్ఘంగా మొబైల్ చూస్తున్నాయి. అన్ని కలిసి వీడియోలను ఆసక్తిగా చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో ఓ వ్యక్తి రాయి పక్కనే ఉన్న గడ్డిలో మొబైల్ లో వీడియో ప్లే చేసి పెట్టాడు. ఆ వీడియో చూడగానే అక్కడే ఉన్న కప్పలన్ని క్షణాల్లో ఫోన్ స్క్రీన్ ముందు వాలిపోయాయి. వరుసలో నిల్చోని ఫోన్ లో వీడియోను ఆసక్తిగా చూస్తున్నాయి. ఇంతలో సదరు వ్యక్తి ఆ మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నంచగా అతడి చేతిపై దాడి చేశాయి. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కప్పలు దాడి చేస్తున్నాయి. ఏకంగా ఓ కప్ప ఆ వ్యక్తి చేతిని కోరికేసింది. ఫోన్ ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కోపంతో రగిలిపోతున్నాయి. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.