Viral News: డాక్టరేట్ పూర్తిచేసిన కూతురు.. ఆ తర్వాత తల్లి చేసిన పని చూసి షాక్.. ఏమైందంటే..

తాజాగా తన కూతురు డాక్టరేట్ పట్టా పొందడంతో ఆ తల్లి తెగ సంబరపడిపోయింది. తన కూతురు సాధించిన విజయాన్ని నగరమంతా గట్టిగా చెప్పాలనుకుంది. అంతే అదే

Viral News: డాక్టరేట్ పూర్తిచేసిన కూతురు.. ఆ తర్వాత తల్లి చేసిన పని చూసి షాక్.. ఏమైందంటే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2022 | 8:48 AM

ప్రపంచంలో అమ్మ ప్రేమను మించినది మరేది లేదు. తల్లి ప్రేమకు ఏది సాటి రాదు. తన పిల్లల అల్లరి చేష్టలను చూసి మురిసిపోయిన అమ్మ.. వారి ఎదుగుదలను చూసి గర్వపడుతుంది. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. వారు వెళ్లే దారుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటుంది. ఇక తమ పిల్లలు జీవితంలో విజయాన్ని సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తన కూతురు డాక్టరేట్ పట్టా పొందడంతో ఆ తల్లి తెగ సంబరపడిపోయింది. తన కూతురు సాధించిన విజయాన్ని నగరమంతా గట్టిగా చెప్పాలనుకుంది. అంతే అదే సమయంలో ఆమెకు ఓ ఆలోచన తట్టింది. తన కూతురికి శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణం మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి విష్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన కేంద్ర బస్బీ అనే మహిళ కూతురు ఇటీవలే డాక్టరేట్ పట్టా పొందింది. తన కుమార్తె విజయాన్ని గర్వంగా ఉందని.. ఆమె సాధించిన గెలుపును నగరం మొత్తం చెప్పాలనుకుంది. దీంతో కూతురి ఫోటోలతో పట్టణం మొత్తం హోర్డింగ్స్ పెట్టించింది. వాటిని చూసి ఆమె కుమార్తె షాకయ్యింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. తన తల్లి ఇచ్చిన సర్ ప్రైజ్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ప్రేమను తెలిపింది. నువ్వు నా మెరిసే నక్షత్రం. నేను గర్వించదగిన తల్లి బీన్. నేను నిన్న ఎప్పటికీ ప్రేమిస్తాను. క్రిస్టీన్ ఎస్.స్మాల్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె చేసిన పోస్టుకు వందల లైక్స్ కామెంట్స్ వచ్చాయి. బస్బీ కుమార్తె క్రిస్టీన్ జూలై 29న ఫిలడెల్ఫియా కాలేజ్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్ నుంచి సైకాలజీలో డాక్టరేట్ పొందింది.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?