Viral Video: మానవులకు ఇదొక హెచ్చరికనా..! మిలియన్ల కొద్దీ మరణించిన చేపలు..

|

Sep 04, 2024 | 5:21 PM

సుందరమైన వోలోస్ ఓడరేవు గత సంవత్సరం సంభవించిన విపత్తు వరదల ఫలితంగా టన్నుల కొద్దీ చనిపోయిన చేపలతో నిండిపోయింది. ఇక్కడ సరస్సు పర్యావరణ విపత్తుకి సజీవ దృశ్యంగా మారింది. వోలోస్ నగరంలో చనిపోయిన చేపలు పెద్ద సమస్యను సృష్టించాయి. చనిపోయిన చేపలు కుళ్లిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ సందర్భంలో అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ అందమైన పర్యాటక ప్రదేశం చుట్టూ ఉన్న నీటి నుంచి 100 టన్నులకు పైగా చనిపోయిన చేపలను బయటకు తీసినట్లు తెలిపారు.

Viral Video: మానవులకు ఇదొక హెచ్చరికనా..! మిలియన్ల కొద్దీ మరణించిన చేపలు..
Greece Massive Fish Death
Image Credit source: X
Follow us on

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షాకింగ్ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది. ఈ షాకింగ్ వీడియోలో చనిపోయిన చేపలతో నిండిన సరస్సు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ వీడియో గ్రీస్‌లోని వోలోస్ నగరానికి సంబంధించినది అని తెలుస్తోంది. నగరంలోని ఓ సరస్సులో మిలియన్ల కొద్దీ చనిపోయాయి. ఈ మరణించిన చేపల దుర్వాసనతో సమీప ప్రాంతం దుర్గంధంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన గ్రీస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అదే సమయంలో వాతావరణ మార్పుల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు ఈ దుర్ఘటనపై అభిప్రాయపడ్డారు. సుందరమైన వోలోస్ ఓడరేవు గత సంవత్సరం సంభవించిన విపత్తు వరదల ఫలితంగా టన్నుల కొద్దీ చనిపోయిన చేపలతో నిండిపోయింది. ఇక్కడ సరస్సు పర్యావరణ విపత్తుకి సజీవ దృశ్యంగా మారింది.

వోలోస్ నగరంలో చనిపోయిన చేపలు పెద్ద సమస్యను సృష్టించాయి. చనిపోయిన చేపలు కుళ్లిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ సందర్భంలో అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ అందమైన పర్యాటక ప్రదేశం చుట్టూ ఉన్న నీటి నుంచి 100 టన్నులకు పైగా చనిపోయిన చేపలను బయటకు తీసినట్లు తెలిపారు.

వాతావరణంలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని దీంతో ఒక్కసారిగా చేపలు సామూహికంగా మరణించినట్లు చెప్పారు. మధ్య గ్రీస్‌లోని వోలోస్ నౌకాశ్రయంతో పాటు చుట్టుపక్కల 100 టన్నులకు పైగా చనిపోయిన చేపలను ఇప్పటికే సేకరించినట్లు వెల్లడించారు.

వాతావరణ మార్పుల వల్ల ఇటీవల సంభవించిన తీవ్రమైన తుఫాను , వరదల కారణంగా అందమైన సరస్సు నుండి ఈ మంచినీటి చేపలు సముద్రంలో కొట్టుకుపోయాయని, దాని కారణంగా అవి మనుగడ సాగించలేకపోయాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

గ్రీస్‌లో వోలోస్ అని పిలువబడే ఓడరేవులో 100 టన్నుల చనిపోయిన చేపలు వెలికి తీయబడ్డాయి. ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిది.. ఎందుకంటే ఇది వాతావరణ మార్పుల గురించి ఆందోళనలను మరింత పెంచే విధంగా ఉంది.

దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. అందులో చనిపోయిన చేపలు సముద్రంలో తేలుతున్నట్లు చూడవచ్చు. వీడియోను పంచుకుంటూ, గత సంవత్సరం ఏర్పడిన వినాశకరమైన వరదల తరువాత గ్రీస్‌లోని అందమైన ఓడరేవు వోలోస్ చనిపోయిన చేపలతో నిన్దిపోయిదని వెల్లడించారు. ఈ భయంకరమైన విపత్తు కారణంగా పర్యాటకం , చేపల వేటపై ఆధారపడిన స్థానిక ప్రజల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కరోజులోనే 57 టన్నులకు పైగా చనిపోయిన చేపలను తొలగించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు క్లీనింగ్‌ పనులు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. గ్రీస్ వాతావరణ మంత్రిత్వ శాఖ ఒక నెల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శరవేగంగా మరణించిన చేపలను తొలగించే పనులు చేస్తోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..