సముద్రం ఎవ్వరికీ అర్ధం కాదు.. మానవ సాంకేతికత అంతుచిక్కని ఎన్నో రహస్యాలు సముద్రంలో ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల జల చరాలు సముద్రంలోతుల్లో నివాసముంటున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వైరల్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. బీచ్ ఒడ్డుకు అరుదైన జలచరాలు రావడం.. లేదా సముద్రంలో వింత జీవులు కనిపించడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అది చూశాక మీరు కూడా షాక్ కావడం ఖాయం.
ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
వైరల్ వీడియో ప్రకారం.. ఓ మోటార్ బోటులో కొందరు వ్యక్తులు ఫిషింగ్ కోసమని సముద్రంలోకి వెళ్లారని మీరు చూడవచ్చు. బోటు చుట్టూ గాలాలు అమర్చి.. చేపలు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇక కొద్దిసేపు వారంతా ఎదురు చూసేసరికి.. కళ్ల ఎదుట ఊహించని దృశ్యం కనిపించింది. ఎక్కడ నుంచి వచ్చాయో గానీ.. కుప్పలు తెప్పలుగా సొర చేపలు అన్ని కూడా ఆ బొట్టు చుట్టూ వచ్చి చేరాయి. తమ ఆకలిని తీర్చుకునేందుకు చేపలను వేటాడేశాయి. ఆ సీన్‌కి షాక్ అయిన సదరు వ్యక్తులు.. అవి వెళ్లిపోయిన తర్వాత హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని లూయిసియానా రాష్ట్రంలో కోస్టల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ సారి లుక్కేయండి.
ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
People on fishing boat caught in middle of massive Shark feeding frenzy off Louisiana coast… pic.twitter.com/BsLfdwE1N7
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 8, 2024
ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..