Viral Video: లండన్‌లోని 17 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో

|

Jul 21, 2022 | 10:45 AM

London Fire Accident: సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజిన్లతో 125 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Viral Video: లండన్‌లోని 17 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
London Fire Accident
Image Credit source: Twitter
Follow us on

London Fire Mishap: లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిటీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని నార్త్ వూల్‌విచ్‌లోని ఓ 17 అంతస్థుల భవనంలోని పై అంతస్థులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజిన్లతో 125 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. తీవ్ర ఎండలు, వడగాల్పులతో లండన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా లండన్‌లో నిత్యం పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సహజంగా ఫైర్ స్టేషన్లకు ఓ రోజులో 500 ఫోన్ కాల్స్ వచ్చేవని.. అయితే గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య 2600కు పైగా ఉన్నట్లు లండన్ మేయర్ సుద్ధీఖ్ ఖాన్ మీడియాకు తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయిలో తీవ్ర ఎండలను లండన్ ప్రజలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. బ్రిటన్‌లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా తీవ్ర ఉక్కపోతతో తాము ఇళ్లలో ఉండలేకపోతున్నట్లు లండన్ ప్రజలు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..