సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. చాలా మంది వీటిని ఆడుతూ.. తమ తెలివిని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. కేవలం నెంబర్స్ మాత్రమే కాకుండా.. ఫొటోల్లో ఉండే తప్పులను కనిపెట్టేవి కూడా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మీ కోసం తీసుకొచ్చాం. ఈ ఫొటోల్లో ఉండేవి చిన్న చిన్న తప్పులే. అలాంటివి కనిపెడితేనే కదా.. మీ బుర్రకు ఉండే పదును ఏంటో తెలుసుకోవచ్చు. నెంబర్స్ ఈజీగానే కనిపెట్టవచ్చు. మరి ఇలాంటి వాటితో కూడా మీ తెలివిని పరీక్షించు కోండి.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని రక రకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇలాంటి చాలెంజ్స్ సాల్వ్ చేయడానికి ఎంతో మంది నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి ఆడటం వల్ల మీ ఐక్యూ లెవల్స్, ఐ సైట్ లెవల్స్, అబ్జర్వేషన్ స్కిల్స్, క్విక్ థింకింగ్ వంటి ఇంప్రూవ్ అవుతాయి. మీ కళ్లకు, మెదడుకు మధ్య సమన్వయాన్ని కూడా తెలుపుతుంది. ఇలాంటివి వాటిని ఆడుతూ.. పిల్లల చేత ఆడిస్తూ ఉంటే మంచి మీ బ్రెయిన్ షార్ప్‌గా పిన చేస్తుంది. పిల్లల్లో కూడా ఏకాగ్రతను పెంచుతుంది.
ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ ఫొటోలో ఒక అమ్మాయి ఫొటో ఉంది. అంద మైన కళ్లతో, నవ్వుతో మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంది కదా. ఈ ఫొటోలోనే చిన్న మిస్టేక్ ఉంది అది మీరు ఇప్పుడు కనిపెట్టాలి. ముందు అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ అలానే చూస్తూ ఉంటే మాత్రం.. ఖచ్చితంగా మీకు కొన్ని పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు సరిగ్గా చూసుకుంటే.. అసలు తప్పు ఏంటి అనేది ఈజీగా చెప్పొచ్చు. ఇందుకు మీకు ఇచ్చే సమయం కేవలం 10 సెకన్లే. ఏంటండీ మీకు ఇంకా సమాధానం దొరక లేదా.. పర్వాలేదు. మీ కోసమే సమాధానం కూడా ఇచ్చేస్తాం. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం ఈజీగా జవాబు కనిపెట్టవచ్చు. ఈ ఫొటోలో అమ్మయి ఎడమ చెవి తలక్రిందులుగా ఉంది చూడండి.