Viral video: నీళ్లలో మొసలి.. అడవిలో అనకొండ మధ్య ఫైట్..చివరకు గెలిచింది ఎవరో చూస్తే..
వైరల్ వీడియోలో ఆకలితో ఉన్న ఒక కొండచిలువకు ఎదురుగా ఉన్న కొలను వంటిది నీటి వనరు కనిపించింది. అందులో ఒక పెద్ద మొసలి కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొండచిలువ దానిపై ఎటాక్ చేసింది. మొసలి దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా కొండచిలువ దాన్ని వదలకుండా పట్టుకుంది. కొండచిలువ పట్టు నుండి

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని అడవి జంతువులు, క్రూర మృగాలకు సంబంధించినవి కూడా ఉంటాయి. అలాంటి వీడియోలను చూసేందుకు ప్రజలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. రెండు బలమైన జంతువుల మధ్య పోరాటం ఎప్పుడూ భీకరంగా, ఉత్కంఠభరితంగానే ఉంటుంది. అలాంటి పాత వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో పాతదే అయినప్పటికీ దాన్ని ప్రభావం మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నీటిలో ఉండే మొసలి.. అడవిలో ఉండే అనకొండ మధ్య పోరాటానికి సంబందించినదే ఈ వీడియో. చివరకు ఎవరూ గెలిచారో ఇప్పుడు చూద్దాం..
వైరల్ వీడియోలో ఆకలితో ఉన్న ఒక కొండచిలువకు ఎదురుగా ఉన్న కొలను వంటిది నీటి వనరు కనిపించింది. అందులో ఒక పెద్ద మొసలి కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొండచిలువ దానిపై ఎటాక్ చేసింది. మొసలి దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా కొండచిలువ దాన్ని వదలకుండా పట్టుకుంది. కొండచిలువ పట్టు నుండి మొసలి తప్పించుకోలేకపోయింది. చివరకు ఆ కొండచిలువ మొసలిని నోట కరుచుకుని గుండ్రంగా తిప్పేస్తూ నీటిలోకి లాగేసుకుంటుంది. అంతటితో ఈ వీడియో కూడా ముగుస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒళ్లు జలదరించే ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో.. చూస్తుంటనే భయంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..