ఆమె దేవతగా.. కూతురికి గుడి కట్టిన తండ్రి.. ఆమె జ్ఞాపకాలతో వినూత్నంగా..!

| Edited By: Ravi Kiran

Dec 13, 2023 | 12:41 PM

మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన సౌందరపాండియన్ ఇందుకోసం కావాల్సిన డబ్బు సమకూర్చుకున్నాడు. డిసెంబరు 11న పవిత్ర కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రతిష్ఠించడంతో ఆయన కృషి, ప్రేమ ఫలించాయి. 'శక్తి ప్రజ్ఞా అమ్మన్' అని పిలువబడే ఈ ఆలయంలో సౌందరపాండియన్ ముద్దుల కూతురును పోలిన దేవత విగ్రహం ఏర్పాటు చేయించాడు. ఈ ఆలయం తండ్రి ప్రేమ, జ్ఞాపకానికి నిదర్శనంగా నిలుస్తుంది.

ఆమె దేవతగా.. కూతురికి గుడి కట్టిన తండ్రి.. ఆమె జ్ఞాపకాలతో వినూత్నంగా..!
Fathers Unwavering Love
Follow us on

చనిపోయిన తన కూతురు ప్రేమకు నివాళులర్పిస్తూ ఓ తండ్రి తిరువారూరు జిల్లాలో ఆలయాన్ని నిర్మించాడు. జిల్లాలోని కూటనల్లూరు సమీపంలోని పుల్లమంగళానికి చెందిన సౌందర పాండియన్ తన కుమార్తె కోసం గుడి కట్టించాడు. ఇది స్థానికుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఐదేళ్ల క్రితం సౌందర పాండియన్ 2 ఏళ్ల కూతురు శక్తి ప్రజ్ఞ ఇంటి సమీపంలోని చెరువులో పడి అకాల మరణం చెందింది. తన ప్రియమైన బిడ్డను కోల్పోయిన ఆ తండ్రి గుండె చెరువైంది. కన్నీరు ఆవిరయ్యేలా రోధించాడు. కుతూరు జ్ఞాపకాలు అతన్ని ఎంతగానో వేధించాయి. ఈ సంఘటనతో తన కుమార్తెను తన హృదయంలో కొలువైన దేవతగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలనే సౌందర పాండియన్ తన ఇంటి పూజా గదిలో శక్తి ప్రజ్ఞ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజించేవాడు. అలా తన కూతురిపై ఏర్పరచుకున్న ప్రేమతో ఏకంగా గుడినే కట్టించాడు.

మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన సౌందరపాండియన్ ఇందుకోసం కావాల్సిన డబ్బు సమకూర్చుకున్నాడు. డిసెంబరు 11న పవిత్ర కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రతిష్ఠించడంతో ఆయన కృషి, ప్రేమ ఫలించాయి. ‘శక్తి ప్రజ్ఞా అమ్మన్’ అని పిలువబడే ఈ ఆలయంలో సౌందరపాండియన్ ముద్దుల కూతురును పోలిన దేవత విగ్రహం ఏర్పాటు చేయించాడు. ఈ ఆలయం తండ్రి ప్రేమ, జ్ఞాపకానికి నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ విషయమై సౌందరపాండియన్ మాట్లాడుతూ.. ప్రేమను దేవత అంటారు.. నా కూతురిపై నాకున్న ప్రేమ వల్లే ఆమె నాలో దేవతగా మిగిలిపోయిందన్నాడు. తన కూతురిపై ఉన్న ప్రేమకారణంగానే తాను ఈ ఆలయం నిర్మించానని చెప్పాడు. నా కుమార్తె కోసం ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పండుగ నిర్వహిస్తున్నానని చెప్పాడు. ఈ ఆలయం తండ్రి నిరంతర ప్రేమకు నిదర్శనం. ఇది శక్తి ప్రజ్ఞా జీవితానికి జ్ఞాపకార్థం. అంటూ స్థానికులు సైతం సౌందరపాండియన్‌ ప్రేను ప్రశంసించారు. ఇలాంటి తండ్రి ప్రేమ చిరస్మరణీయం అంటూ కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..