Rare Bird: ఇదెక్కడి చిత్రం… సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత ఇలా..

|

Jul 23, 2024 | 9:24 AM

శాస్త్రవేత్తలు చాలా కీటకాలలో ఇటువంటి ప్రత్యేకతను గుర్తించినప్పటికీ, పక్షుల విషయానికి వస్తే, ఇది చాలా అరుదు. అయితే, శాస్త్రవేత్తలు పూర్తిగా మగ కాని ఆడ కాని పక్షిని కనుగొన్నారు. ఆడ, మగ ఇద్దరి గుణాలు ఇందులో కనిపిస్తాయి. అర్ధనారీశ్వర రూపంలో సగం మగ, సగం ఆడ అని పిలువబడే ఈ పక్షి విశిష్ట పక్షి గురించి ఈరోజు తెలుసుకుందాం.

Rare Bird: ఇదెక్కడి చిత్రం... సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత ఇలా..
Mutant Honeycreeper
Follow us on

పక్షుల్లో కూడా ట్రాన్స్‌జెండర్లు ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవి పూర్తిగా మగ లేదా పూర్తిగా ఆడవి కావు. శాస్త్రవేత్తలు చాలా కీటకాలలో ఇటువంటి ప్రత్యేకతను గుర్తించినప్పటికీ, పక్షుల విషయానికి వస్తే, ఇది చాలా అరుదు. అయితే, శాస్త్రవేత్తలు పూర్తిగా మగ కాని ఆడ కాని పక్షిని కనుగొన్నారు. ఆడ, మగ ఇద్దరి గుణాలు ఇందులో కనిపిస్తాయి. అర్ధనారీశ్వర రూపంలో సగం మగ, సగం ఆడ అని పిలువబడే ఈ పక్షి విశిష్ట పక్షి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రపంచంలో కెల్ల అరుదైన, వింత జీవి ఈ పక్షి. ఇది పూర్తిగా మగ, పూర్తిగా ఆడది కాదు. ఇద్దరి గుణాలు ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి జీవులను ‘gynandromorph’ అంటారు. రెండు లింగాల గుణాలు వీటిలో ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకత కలిగిన అనేక కీటకాలను కనుగొన్నప్పటికీ, పక్షులలో ఇలాంటిది గుర్తించటం చాలా అరుదు. వంద సంవత్సరాల క్రితం ఒక పక్షి ఉండేది. అది అంతరించిపోయిందని భావించారు. కానీ, గతేడాది క్రితం ఇలాంటి పక్షి మళ్లీ కనిపించింది. న్యూజిలాండ్‌ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్‌ హమీష్‌ స్పెన్సర్‌, కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులతో ఈ పక్షి ఉంటుంది. వంద సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని భావించిన ఇలాంటి పక్షి చాలా సంవత్సరాల తర్వాత కనిపించడంతో వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉన్నాయని చెప్పారు.. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని శాస్త్రవేత్త తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..