Elephant Video : ఆకలితో ఉన్న ఏనుగు.. రెండు కాళ్లపై నిలబడి ఇలా ఏం చేస్తుందో చూస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..

|

Aug 30, 2024 | 7:17 AM

కడుపు నింపుకోవడం కోసం ఈ ఏనుగు చేసిన విన్యాసాలు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా,.. వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు భయపడుతున్నారు. మరికొందరు ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మూగజీవాల ఆకలి కష్టాలను చూసి చలించిపోతున్నారు. ఇకపోతే,

Elephant Video : ఆకలితో ఉన్న ఏనుగు.. రెండు కాళ్లపై నిలబడి ఇలా ఏం చేస్తుందో చూస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..
Elephant
Follow us on

ఏనుగు చాలా తెలివైన జీవి. అంతేకాదు.. ఏనుగు చాలా ఎమోషనల్‌ జంతువు అని కూడా అంటారు. కాబట్టి, అది మనుషులతో ఎక్కువ స్నేహ సాంగత్యం కలిగి ఉంటుంది. ఇక ఈ భూమిపై ఏనుగులు దాదాపు 70 సంవత్సరాల వరకు జీవించగల అతిపెద్ద జంతువులు. ఏనుగులు స్పర్శ, దృష్టి, వాసన, ధ్వని ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఏనుగు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆహారం కోసం ఒక ఏనుగు చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యపోతారు. ఆకలి తీర్చుకోవటం కోసం ఆ ఏనుగు సర్కాస్‌ ఫీట్లు చేస్తున్న తీరు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మానవుడి దాష్టీకాలకు అడవులు అంతరించి పోతున్నాయి. కొండలు తరిగిపోతున్నాయి. చెట్లు కనుమరుగవుతున్నాయి. దీంతో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ఆహారం, ఆవాసం కోసం జనారణ్యంలోకి వచ్చి సంచరిస్తున్నాయి. అడవుల్లో హాయిగా విహరిస్తూ అక్కడి చెట్ల ఆకులు, పండ్లు ఫలాలు ఆరగించి బతికే అడవి జంతువులు చెట్లు కనుమరుగవడంతో వన్యప్రాణులు ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఊళ్లోకి వచ్చిన ఏనుగు ఓ ఇంట్లో ఆహారం దొరుకుతుందేమోనని వెతుకుతోంది. అందుకోసం మొదటి అంతస్తులో ఉన్న వంటింటి కిటీకిలోంచి తన తోండంతో ఆహారం తీసుకుంటోంది. ఇందులో ఆ ఏనుగు తన ముందురెండు కాళ్లను పైకెత్తి నిలబడింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిలబడి.. మొదటి అంతస్తులోంచి ఆహారం తీసుకుని తింటున్న ఈ దృశ్యం నిజంగా షాకింగ్‌నే కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఏనుగు రెండు వెనుక కాళ్లపైన తన మొత్తం శరీర బరువును వదిలేసి, ముందు రెండు కాళ్లను పైకెత్తి ఎలాగోలా సర్కస్ చేసి వంటగదిలోంచి ఆహారం తీసుకుని ఆకలి తీర్చుకుంటుంది. కడుపు నింపుకోవడం కోసం ఈ ఏనుగు చేసిన విన్యాసాలు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా,.. వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు భయపడుతున్నారు. మరికొందరు ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మూగజీవాల ఆకలి కష్టాలను చూసి చలించిపోతున్నారు. ఇకపోతే, ఈ వీడియోను సుశాంత్ నందా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..