Viral Video: దర్జాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే..
ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. ఏనుగులు(elephant) చాలా సున్నితమైన జంతువులు, కానీ కొన్నిసార్లు అవి కోపంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు..

ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. ఏనుగులు(elephant) చాలా సున్నితమైన జంతువులు, కానీ కొన్నిసార్లు అవి కోపంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో(Viral Video) ఏనుగు కోపంగా ఉండే వీడియోలే ఎక్కవగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏనుగుపై కూర్చుని వెళ్తున్నట్లుగా చూడవచ్చు. ఎంతో తేలిగ్గా నడుస్తున్న ఈ ఏనుగు.. ఇద్దరు వ్యక్తులను చూసి ఒక్కసారిగా కోపాన్ని ప్రదర్శించింది. అప్పుడే, తన కోపాన్ని వ్యక్తం చేయడానికి.. ఏనుగు తన తోకతో చాలా వేగంగా వారిద్దరినీ కొట్టడం కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఏనుగు వారిపై ఇంత కోపంగా ఎందుకు ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు అని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే అది అలా సరదాగా కొట్టిందా.. కోపంగా కొట్టిందా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది తోకతో కొట్టడం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది కొట్టిన దెబ్బకు ఆ విదేశీలు కొత్త షాక్ అయినప్పటికీ.. ఆ తర్వాత తేరుకుని నవ్వుకున్నారు.
Elephant knows for whom it is spending a life in captivity. Well done ?? VC:Escribano pic.twitter.com/PXOU4MykcX
— Susanta Nanda IFS (@susantananda3) April 5, 2022
అడవి జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను తరచుగా షేర్ చేసే ఫారెస్ట్ ఆఫీసర్ IFS సుశాంత్ నందా ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తూ ఓ కామెంట్ జోడించాడు. ‘ ఈ ఏనుగు బందిఖానాలో తన జీవితాన్ని గడుపుతుందో తెలుసు. సోషల్ మీడియాలో ఏనుగు చేసిన ఈ చర్యను చూసిన ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ‘వాట్ ఎ షాట్’ అంటూ కామెంట్ చేశాడు ఓ యూజర్.
ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..
Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..
Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..