డాన్స్‌కు ఏజ్ కు సంబంధం లేదు అని చాలా సార్లు రుజువైంది. మన ఇండియాలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే డాన్స్ మాత్రం పక్కా ఉంటుంది. వివాహాలు, పండుగలు, ఊరేగింపులలో డీజే పాటలు, డప్పులకు యువకులు రెచ్చి పోయి డాన్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మహిళలు కూడా మైమరచిపోయి డాన్స్ లతో దుమ్మురేపుతూ ఉంటారు. ఇక నాగిని మ్యూజిక్ వచ్చిందంటే చాలు ఉత్సహం డబుల్ అవుతుంది. తాజాగా ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నాగిని మ్యూజిక్ కు అదిరిపోయే స్టెప్పులేశాడు ఓ తాత.
ఇద్దరు వృద్ధులు నాగిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు వృద్ధుల్లో ఒకరు బూర ఊదుతున్నట్టు చేస్తుంటే దానికి తగ్గట్టు మరో వృద్ధుడు నాగినాలా మెలికలు తిరిగాడు. వాళ్లు డాన్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. అది కూడా ఈ వయస్సులో అంటే నిజంగా శబాష్ అనాల్సిందే…
ఈ వయసులో వీరిద్దరూ ఇలా ఎనర్జీగా డ్యాన్స్‌లు చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వయసులో ఇద్దరికీ బలం, ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో కూడా వాళ్ళు ఆరోగ్యాన్ని, శరీరాన్ని అంత దృఢంగా ఉంచుకున్నారని కొనియాడారు.కొంతమంది తాగి ఉన్నారుఅందుకే ఇలా చేస్తున్నాడంటూ చమత్కరించారు. ఈ వీడియోను 34,000 మందికి పైగా చూశారు. 11,000 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.
उम्र क्या है! अगर मस्ती ज़िंदा है तो ही हस्ती ज़िंदा है। pic.twitter.com/aqP1DyYIdA
— Jaiky Yadav (@JaikyYadav16) November 7, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..