AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి.. రామేశ్వరం విల్లుండి తీరంలో కనిపించిన అనుకోని అతిథి

సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. కంటికి కనిపించని లార్వా నుంచి అత్యంత పెద్దమైన నీలి తిమింగలం వరకు సర్వం సముద్రంలోనే. తిమింగలాలు, డాల్ఫిన్‌, చేపలు, నీటి పాములు..

Viral: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి.. రామేశ్వరం విల్లుండి తీరంలో కనిపించిన అనుకోని అతిథి
Dogong
Ganesh Mudavath
|

Updated on: Dec 19, 2022 | 5:19 PM

Share

సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. కంటికి కనిపించని లార్వా నుంచి అత్యంత పెద్దమైన నీలి తిమింగలం వరకు సర్వం సముద్రంలోనే. తిమింగలాలు, డాల్ఫిన్‌, చేపలు, నీటి పాములు.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఎన్నో రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఈ జీవులు అప్పుడప్పడూ సముద్ర తీరానికి కొట్టుకొస్తాయి. అయితే వాటిలో ఎక్కువగా మృత కళేబరాలే ఉంటాయి. కానీ చాలా అరుదుగా కొన్ని జీవులు సజీవంగా సముద్రతీరానికి కొట్టుకొస్తుంటాయి. తాజాగా తమిళనాడు రామేశ్వరంలోని విల్లుండి సముద్ర తీరానికి ఓ అరుదైన జీవి సజీవంగా కొట్టుకొచ్చింది. దానిని చూసి స్థానికకులు ఆశ్చర్యపోయారు. వెంటనే జలవనరులశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో విల్లుండి సముద్రా తీరానికి చేరుకున్నారు అధికారులు. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని దుగోంగ్‌గా ( ఓ రకమైన సముద్ర జీవి ) గుర్తించారు.

ఒడ్డుకు కొట్టుకు వచ్చిన దుగోంగ్‌ను తిరిగి సముద్రంలోకి పంపించారు. ఇవి సముద్ర క్షీరదాలు. సిరేనియా జాతికి చెందిన క్షీరదం. ఇవి నాలుగు రకాలు ఉంటాయి. అందులో దుగోంగ్‌ ఒకటి. ఇవి చూడటానికి సీల్స్‌ లాగే ఉంటాయి. సముద్రపు ఆవులుగా పిలువబడే ఈ జీవులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని సముద్ర జలాల్లో జీవిస్తున్నాయి. ఈ దుగోంగ్‌ల తోక అచ్చం డాల్ఫిన్‌ తోకను పోలి ఉంటుంది. దాంతో చూసిన వెంటనే దీనిని డాల్ఫిన్‌ అనుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..