AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హారర్ సినిమాను మించిన సీన్.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, నిద్రపోతున్న వ్యక్తి మంచంపైకి నాగుపాము ఎక్కింది. ఆ వ్యక్తి సమయానికి మేల్కొని పామును పారదోలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన నెటిజన్లను భయపెడుతోంది. పాముల నుండి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లోకి పాములు రాకుండా చూసుకోవాల్సిన మార్గాలను ఈ కథనం వివరిస్తుంది.

Viral Video: హారర్ సినిమాను మించిన సీన్.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!
Cobra Snake On Sleeping Man
Balaraju Goud
|

Updated on: Aug 17, 2026 | 6:39 PM

Share

సోషల్ మీడియాలో ఓ భయానక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. నిద్రపోతున్న ఓ వ్యక్తి మంచంపైకి నాగుపాము ఎక్కిన దృశ్యాలు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గదిలో ఏర్పాటు చేసిన కెమెరాలో ఈ ద‌ృశ్యాలు రికార్డ్ అయ్యాయి.. ఈ వీడియోలో.. ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా, పొడవైన నాగుపాము నెమ్మదిగా మంచంపైకి ఎక్కింది. ఆ దృశ్యాలు చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.

ఈ వీడియోలో మొదట అంతా ప్రశాంతంగానే కనిపించింది. ఆ వ్యక్తి ఏమీ తెలియకుండా నిద్రపోతుండగా.. పాము అతడి వైపు కదులుతూ వస్తుంది. కొద్దిసేపటికి అది అతడికి అత్యంత సమీపంగా చేరుకుంది. మరింత భయానకంగా.. పాము అతడి శరీరంపైకి పాకుతున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ సమయంలో పాము కాటుకు ప్రయత్నించి ఉంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కొద్దిసేపటి తర్వాత నిద్రలో ఉన్న వ్యక్తికి ఏదో వింతగా అనిపించింది. దీంతో తనపై పాము ఉన్నట్లు గుర్తించిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. భయంతో గట్టిగా అరుస్తూ, పామును తన నుంచి దూరంగా చేసేందుకు కాళ్లతో తన్నేందుకు ప్రయత్నించాడు. అతడి ఆకస్మిక కదలికలకు భయపడిన నాగుపాము వెంటనే మంచం మీద నుంచి కిందకు దూకింది.

ఆ తర్వాత పాము గది మూలవైపు వేగంగా పాకుతూ వెళ్లి అక్కడ దాక్కున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిసేపటి పాటు జరిగిన ఈ ఘటనను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘‘ఇది హారర్ సినిమా సీన్‌ను మించిపోయింది’’, ‘‘జీవితం, మరణం మధ్య కొన్ని క్షణాలు’’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అతడు మరికొంతసేపు నిద్రలోనే ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయంగా ఉందని పేర్కొన్నారు.

అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము నిజంగా నాగుపామేనా అనే అంశం కూడా స్వతంత్రంగా నిర్ధారించలేము. వర్షాకాలం, వేసవి సమయంలో పాములు ఆశ్రయం, చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇళ్ల చుట్టూ పొదలు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం, రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండటం, పాము కనిపిస్తే దానిని స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ టీమ్‌కు, సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది. వైరల్ వీడియో ఏదైనా సరే.. పాముల విషయంలో అప్రమత్తతే ప్రాణాలను కాపాడే తొలి జాగ్రత్త అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us