సాధారణంగా పెద్దపులిని వేటాడేందుకు రంగంలోకి దిగితే.. ఏ జీవినైనా సెకన్లలో మట్టికరిపిస్తుంది.. కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నబాతు పిల్ల పెద్దపులినే ఆటాడేసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబయో వైల్డ్ లైఫ్ పార్క్‌లో వెలుగు చూసింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక పెద్ద పులి నీటి కాలువలో నడుస్తూ వెళ్తోంది. దానికి ఎదురుగా ఒక బాతు పిల్ల కనిపించింది. ఆహా..వెతుకుతున్న తీగ కాలికే తగిలింది..అన్నట్టుగా ఫీల్ అయింది ఆ బాతు..ఇక తనకు ఎదురుగా ఉన్న ఎర ఈజీగా దొరుకుతుందని భావించింది. అలాగే, నీటిలో నడుస్తూ బాతు పిల్ల దగ్గరకు రానే వచ్చింది.
పిల్లబాతే కదా అనుకుని తన పంజాతో ఒక్కసారిగా బాతును ఆహారంగా మార్చుకోవాలనుకుంది ఆ పులి. కానీ బాతు మాత్రం తనను చంపడానికి వచ్చిన పులికి చుక్కలు చూపించింది. ‘బాడీలో ఏముంది బాస్.. అంతా బుర్రలోనే కదా ఉండేది’ అన్నట్లు పులికి బుద్ది చెప్పింది పిల్లబాతు.
ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరికి పులి చేసేదేంలేక వెనుదిరిగి వెళ్ళిపోయింది. పులి, బాతుల మధ్య జరిగిన ఈ దాగుడుమూతల ఫైట్ ను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కండ బలం కంటే బుద్దిబలం గొప్పదని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..