Madhya pradesh: వామ్మో, ఇదెక్కడి విచిత్రంరా దేవుడో.. గుడ్డులో మరో గుడ్డు, దాని దేనిదో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌!!

|

Jun 14, 2022 | 12:23 PM

వామ్మో గుడ్డులోపల మరో గుడ్డు..అవునా..? అది నిజమేనా..? ఇదెక్కడి విచిత్రం అనే సందేహం కలుగుతుంది కదా..? కానీ, ఇది నిజంగానే దొరికింది. ఒక భారీ సైజున్న గుడ్డులోపల మరో గుడ్డు కనిపించింది. అదేదో మాములు కోడి, బాతు,..

Madhya pradesh: వామ్మో, ఇదెక్కడి విచిత్రంరా దేవుడో.. గుడ్డులో మరో గుడ్డు, దాని దేనిదో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌!!
Rare Dinosaur Egg
Follow us on

వామ్మో గుడ్డులోపల మరో గుడ్డు..అవునా..? అది నిజమేనా..? ఇదెక్కడి విచిత్రం అనే సందేహం కలుగుతుంది కదా..? కానీ, ఇది నిజంగానే దొరికింది. ఒక భారీ సైజున్న గుడ్డులోపల మరో గుడ్డు కనిపించింది. అదేదో మాములు కోడి, బాతు, మరెదో పక్షులకు సంబంధించిన గుడ్డు మాత్రం కాదండోయ్‌..అది ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్‌ గుడ్డు. మధ్యప్రదేశ్‌లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్‌ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్‌ జిల్లా బాఘ్‌ ప్రాంతంలో లభించింది. ఇలాంటి గుడ్డు లభించడం డైనోసార్‌ శిలాజాల చరిత్రలో ఇదే ప్రథమమని ఢిల్లీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో గల ‘డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్’లో 10 డైనోసార్ గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం నిర్వహించిన అధ్యయనంలో అక్కడి పార్కులో మొత్తం 52 డైనోసార్ల గూళ్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా గుడ్ల శిలాజాలను గుర్తించారు. పది గుడ్లలో ఒకటి వెరీ స్పెషల్ అని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ గుంటుపల్లి వి.ఆర్.ప్రసాద్ తెలిపారు. సాధారణంగా గుడ్డుపై ఒక ఎగ్ షెల్ ఉంటుంది. కానీ వృత్తాకారంలో ఉన్న ఓ గుడ్డు లోపల అదనంగా మరో ఎగ్ షెల్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గుడ్డులో మరో గుడ్డు కనిపించింది. అది చూసి సైంటిస్టులే విస్తూ పోయారు. దానిపై మరింత పరిశోధన కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి