డాలీ చాయ్‌వాలా.. ఈ పేరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిల్ గేట్స్‌కు టీ అమ్మిన తర్వాత డాలీ చాయ్‌వాలాకు ఆదరణ పెరిగింది. టీవీ నుండి సోషల్ మీడియా వరకు డాలీకి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. డాలీ చాయ్‌వాలా చాలా షోలలో కనిపించాడు. అయితే ఒక్కరోజు షో కోసం డాలీ చాయ్‌వాలా ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? ఈ ధర తెలిస్తే షాక్ అవుతారు. కువైట్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ డాలీ చాయ్‌వాలా ఒక్కొ షో ఫీజు ఎంత తీసుకుంటారో వెల్లడించారు. డాలీ చాయ్‌వాలాతో కలిసి ఫుడ్ వ్లాగింగ్ చేయడాన్ని ఇష్టపడే ‘ఏకే ఫుడ్ వ్లాగ్’ ‘డాలీ కి తాప్రీ’ని సంప్రదించగా డాలీ ఫీజు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడట. వివరాల్లోకి వెలితే…
ఐకే ఫుడ్ వ్లాగ్ ప్రకారం..తాను డాలీ చాయ్‌వాలాను కువైట్‌కి పిలవాలనుకుంటున్నాను కాబట్టి పిలిచానని చెప్పాడు. కానీ, అతని డిమాండ్లను విని ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఎందుకంటే.. డాలీ చాయ్‌వాలా తన ఫీజు 2 వేల దినార్లు అంటే 5 లక్షల రూపాయలు అని చెప్పాడు. తాను డాలీ మేనేజర్‌తో మాట్లాడినట్టుగా చెప్పాడు. తాను కువైట్‌కి వస్తానని చెప్పినప్పుడు, అతను 2000-25000 కువైట్ దినార్లు అడిగాడు. అంతేకాదు డాలీతో పాటు మరో వ్యక్తి వస్తాడని చెప్పాడు. 4 లేదా 5 స్టార్ హోటళ్లలో ఇద్దరికీ గదులు బుక్ చేయాలని డిమాండ్ చేశాడు. ఇదంతా కేవలం అతని 1 రోజు ఛార్జ్ మాత్రమేనని చెప్పాడు.
ఈ వీడియో చూడండి..
ఇలా డాలీ చాయ్‌వాలా నికర విలువ రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఒక కప్పు డాలీ టీ ధర కేవలం ఏడు రూపాయలు మాత్రమే. కానీ రోజుకు 350-500 కప్పుల టీ విక్రయిస్తున్నాడు. దీని ప్రకారం, వారి రోజువారీ సంపాదన రూ. 2,450 – 3500 వరకు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, బిల్ గేట్స్ డాలీ చాయ్‌వాలా టీ తాగుతూ కనిపించిన డాలీ చాయ్‌వాలా వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం సృష్టించింది.. ఈ వీడియో దావానలంలా వ్యాపించింది. దాంతో డాలీ చాయ్‌వాలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.
ఈ వీడియో చూడండి..
ఆ తరువాత చాలా మంది చాయ్ పే చర్చా వంటి కార్యక్రమాలకు డాలీని ఆహ్వానించడం ప్రారంభించారు. ఆ కార్యక్రమాల్లో డాలీ మాట్లాడుతూ.. బిల్ గేట్స్‌ను తాను గుర్తించలేదని అన్నారు. ఎవరో విదేశీయులు తన దుకాణానికి వచ్చి టీ తాగడానికి వచ్చారని భావించినట్టుగా చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..