Dog Pushups: ఫిట్నెస్‌ను కాపాడుకుంటున్న కుక్క.. పుషప్స్ తీసే విధానం చూస్తే మీరే షాకవుతారు.. వైరల్ వీడియో..
Funny Video: సోషల్ మీడియాలో జంతువులు కూడా హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు మనందరినీ నవ్విస్తుంటే..
Funny Video: సోషల్ మీడియాలో జంతువులు కూడా హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు మనందరినీ నవ్విస్తుంటే.. మరి కొన్ని క్యూట్‌గా మనసుకు హత్తుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ కుదిపేస్తోంది. ఎందుకనుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ కుక్క తెగ వ్యాయామం చేస్తోంది. అవునండీ.. కుక్క తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటోంది. దీనిలో కుక్క పుషప్స్ తీసే విధానం చూస్తే తెగ ముచ్చటేస్తోంది. దీనిని చూసినవారంతా ఆ కుక్కను అభినందిస్తున్నారు.
వాస్తవానికి విశ్వాసం గల జంతువు ఏదీ అంటే.. మొదట మనం కుక్క పేరే చెబుతాం. ఎందుకంటే.. దానిని చేరదీసి గుప్పెడన్నం వేస్తే.. అది మన వెన్నంటే ఉంటూ రక్షిస్తుంది. ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనకాడదు. అలాంటి ఓ కుక్క ఒక ఫన్నీ స్టైల్‌లో కారు వెనుక భాగంలో పైన రెండు కాళ్లు పెట్టి.. టైరు దగ్గర పుషప్స్ తీస్తోంది. ఫిట్నెస్‌కు నేనూ సైతం అంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను చూసినవారంతా.. నవ్వుతూ.. కుక్క పుషప్స్ తీసే విధానాన్ని అభినందిస్తున్నారు.
మొదట ఈ ఫన్నీ వీడియోను చూడండి..
Fitness freak… pic.twitter.com/ZTaeDe2Lkz
— Susanta Nanda IFS (@susantananda3) March 29, 2021
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ ఆయన.. కుక్కకు ఎలా పుషప్స్ కొడుతుందో చూడండి అంటూ.. ట్విట్ చేశారు. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దీనిని 37వేల మంది చూశారు. చూసినవాళ్లంతా కామెంట్లు చేయడంతోపాటు షేర్ కూడా చేస్తున్నారు.
Also Read: