అటు కోబ్రా.. ఇటు ముంగిస.. పోటాపోటీ పోరాటంలో గెలిచిందెవరు.. నిలిచిందెవరు.. వీడియో వైరల్
Fight between Mongoose and Cobra: త్రాచు పాము, ముంగిస శత్రుత్వం గురించి మనం చెప్పాల్సిన పనిలేదు. ఎంతటి విషపూరిత పామైనా సరే.. ముంగిస అడ్డం తిరుగుతుంది. ముంగిస కనిపించినా సరే.. పాము
Fight between Mongoose and Cobra: త్రాచు పాము, ముంగిస శత్రుత్వం గురించి మనం చెప్పాల్సిన పనిలేదు. ఎంతటి విషపూరిత పామైనా సరే.. ముంగిస అడ్డం తిరుగుతుంది. ముంగిస కనిపించినా సరే.. పాము బుస కొట్టి మరి ఎదురు తిరుగుతుంది. రెండూ కూడా ఒకదానికొకటి సవాలు చేసుకోని మరి పొట్లాడుకుంటుంటాయి. ముంగిస.. పాము శత్రుత్వం ఎలాఉంటుందంటే.. రెండూ ఎదురెదురుగా తలపడ్డాయంటే.. నెత్తుటి యుద్ధం మొదలైనట్లే. తరచుగా.. అవి పోరాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ముంగిస ఎదురుపడగానే ఎంతటి పామైనా ముందు తప్పించుకోవాలనుకుంటుంది. కానీ గత్యంతరం లేకపోతే అది కూడా పోరాటంలోకి దిగుతుంది. అందుకే వాటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడిలో కోబ్రా పాము హాయిగా తిరుగుతూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ముంగిస తారసపడుతుంది. ముంగిస.. పాము రెండూ కూడా పోరాటంలోకి దిగుతాయి. ఈ యుద్ధంలో పాము తనను తాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పడగ విప్పి ముంగిసపై తిరగబడుతుంది. కానీ ముంగిస మాత్రం అస్సలు వెనక్కు తగ్గడం లేదు. చివరికి ఇద్దరి మధ్య పోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.
ఈ వీడియోను మీరు కూడా చూడండి..
النمس مع وجبة المفضله pic.twitter.com/RtesvhgLZz
— عالم الحيوانات المفترسة (@em4g1) March 27, 2021
ఈ క్రమంలో పాము వెనక్కి తగ్గి ఆత్మరక్షణ కోసం పరుగులు తీస్తుంది. ముంగిస దానిని వెంబడిస్తూ దాడి చేస్తుంటుంది. ఈ క్రమంలో పాముకు అదృష్టం కలిసివస్తుంది. పరిగెత్తుతున్న క్రమంలో రంధ్రం కపిపించగానే పాము దానిలోకి వెళ్లి తలదాచుకుంటుంది.
Also Read: