Viral Video: వింత వస్తువు అనుకోని వాసన చూశాయి.. తీరా అసలు విషయం తెలిసి పరుగులుపెట్టాయి

మనుషుల్లో ఉండే సహజ గుణాలు జంతువుల్లోనూ ఉంటాయి. మనలనే అవి కూడా వాటి ఎమోషన్స్ ను వ్యక్తపరుస్తూ ఉంటాయి. మనుషుల్లానే దుఃఖం, బాధ, నవ్వు, సంతోషం ఇలా అన్ని ఎమోషన్స్ ను జంతువులు కూడా సందర్భాన్ని బట్టి వ్యక్తపరుస్తూ ఉంటాయి.

Viral Video: వింత వస్తువు అనుకోని వాసన చూశాయి.. తీరా అసలు విషయం తెలిసి పరుగులుపెట్టాయి
Dog And The Horse
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2022 | 5:52 PM

Viral Video: మనుషుల్లో ఉండే సహజ గుణాలు జంతువుల్లోనూ ఉంటాయి. మనలానే అవి కూడా వాటి ఎమోషన్స్ ను వ్యక్తపరుస్తూ ఉంటాయి. మనుషుల్లానే దుఃఖం, బాధ, నవ్వు, సంతోషం ఇలా అన్ని ఎమోషన్స్ ను జంతువులు కూడా సందర్భాన్ని బట్టి వ్యక్తపరుస్తూ ఉంటాయి. అలాగే జంతువుల్లో స్నేహభావం కూడా ఎక్కువే.. చాలా జంతువులు వైరాన్ని మరిచి స్నేహంగా ఉండటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం.. అలానే వాటిలో సాయం చేసే గుణం కూడా ఎక్కువే.. ఒకదానికి మరొకటి ఎప్పుడు సాయం చేసుకుంటూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. అంతలా ఆ వీడియోలో ఏమున్నదంటే..

తాబేలు గురించి అందరికి తెలిసిందే. అవి చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. నీటిలోనూ నెల పైన జీవించే జంతువుల్లో తాబేలు కూడా ఒకటి. ఒక పచ్చిక  మైదానంలో ఒక తాబేలు మెల్లగా కదులుతూ వెళ్తోంది. అయితే ఇంతలో అక్కడికి ఒక గుర్రం, ఒక కుక్క వచ్చాయి. వాటిని చూసిన తాబేలు భయంతో దాని దాని తలను లోపల దాచేసుకుంది. దాన్ని చూసి ఎదో వింత వస్తువు అనుకున్నాయి అవి రెండు. అయితే ముందుగా కుక్క ఆ తాబేలును వాసన చూడటం మొదలు పెట్టింది. ఆతర్వాత గుర్రం దాని దగ్గరకు వచ్చి వాసనా చూసింది. ఇంతలో ఆ తాబేలు ఒక్కసారిగా కదిలింది. అంతే దెబ్బకు భయంతో పరుగులు పెట్టాయి కుక్క , గుర్రం . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోని తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ ఫన్నీ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి