Viral: తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా.. సెంటీమీటర్ పొడవైన

ఈ కేసు కొంచెం క్లిష్టమైనది. నొప్పి, బాధతో వచ్చిన పేషెంట్‌కు ఎక్స్ రే తీయగా.. డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఆ ఎక్స్‌రేలో కనిపించింది చూడగా.. మైండ్ బ్లాంక్ అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

Viral: తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా.. సెంటీమీటర్ పొడవైన
Trending 1

Updated on: Jul 10, 2025 | 1:50 PM

తమ ఎన్నో ఏళ్ల సర్వీసులో డాక్టర్లు చాలా క్లిష్టమైన కేసులు సాల్వ్ చేస్తుంటారు. కొన్ని సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని చాలా అరుదుగా ఉంటాయి. శరీరంలోకి చొచ్చుకుపోయిన వస్తువులతో కొందరు బాధితులు ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటి రేర్ కేసులను తమ మెడికల్ జర్నల్స్‌లో పొందుపరుస్తారు. మరి ఆ కోవకు చెందిన ఓ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా

వివరాల్లోకి వెళ్తే.. ఓ 22 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లతో ఆస్పత్రిలో చేరాడు. అతడి కళ్లు, ముక్కుకు తీవ్రమైన గాయం అయింది. దాని వల్ల అతడు అతికష్టం మీద చూడగలుగుతున్నాడు. దీంతో వెంటనే ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. సదరు బాధితుడికి ఎక్స్‌రే, CT స్కాన్ చేయగా.. గాయం పరిమాణం లోతుగా ఉందని తేలింది. వెంటనే శస్త్రచికిత్స చేసి.. వ్యక్తి కళ్లల్లో ఇరుక్కున్న ప్లాస్టిక్ చిప్‌ను తీశారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

రోగికి జనరల్ అనస్థీషియా ఇచ్చి దాదాపు 1 సెం.మీ వెడల్పు ఉన్న ప్లాస్టిక్ చిప్‌ను బయటకు తీశారు. ఈ విషయాన్ని రేడియాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో పొందుపరిచారు. కానీ గాయం ఎలా అయిందా అనే విషయాన్ని చెప్పలేదు. ఇక ఒక నెల తర్వాత మళ్లీ చెకప్‌కు సదరు వ్యక్తి రాగా.. అతడి కంటి నరాలు ఏమాత్రం దెబ్బతినలేదని.. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ సంకేతాలు లేకపోవడంతో.. చూపు సరిగ్గా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఆ ప్లాస్టిక్ చిప్.. అతడికి కనుగుడ్డుకు కేవలం ఒక సెంటీమీటర్ దూరంలో చిక్కుకుంది. సదరు వ్యక్తి ఆడుకునే సమయంలో ఇది జరిగి ఉండొచ్చునని డాక్టర్లు పేర్కొన్నారు.

ఇది చదవండి: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..