AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాలేదు.. ఏంటా అని పరిశీలించగా

కడప జిల్లాలో అదృశ్యమైన యువతిని ట్రేస్ చేశారు పోలీసులు. గొర్రెలు కాసేందుకు వెళ్లిన సదరు యువతి.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించిన సదరు యువతి కుటుంబం.. వారికీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వివరాలు ఇవిగో..

Kadapa: గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాలేదు.. ఏంటా అని పరిశీలించగా
Sheep
Ravi Kiran
|

Updated on: Jul 09, 2025 | 11:55 AM

Share

కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై మిస్టరీ వీడింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వేంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు పోలీసులు. అనంతరం యువతి నీరసంగా ఉండటంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అటు యువతి అదృశ్యంపై మంగళవారం రాత్రి వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి చెందిన యువతి అదృశ్యం కావడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

మంగళవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుకునేందుకు వేంపల్లి సమీపంలోని కొండల్లోకి సాయద్ సమయ అనే యువతి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండాపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు సదరు యువతి కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. గొర్రెలు మేపే ప్రదేశం వద్దకు వెళ్లిన యువతితో చనువుగా ఓ వ్యక్తి, అతడితో పాటు స్నేహితులు కూడా వెళ్లినట్టు గుర్తించారు.

రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. వేంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు. యువతి మధ్యాహ్నం నుంచి ఏం తినకపోవడంతో అనారోగ్యంగా ఉండటం వల్ల.. కడప రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం యువతి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతోందని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అన్నారు. యువతితో చనువుగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వేంపల్లి శివారు ప్రాతంలో అసలేం జరిగింది అనే దానిపై విచారణ చేపట్టాం. యువతి గొర్రెలు కాసే సమయంలో అక్కడికి ఎవరెవరు వెళ్లారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాగా, ప్రస్తుతం యువతి సేఫ్‌గా ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!