
భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్దది. ప్రతిరోజూ దాదాపు 2.3 కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. కానీ, దేశంలోని 28 రాష్ట్రాలలో, ఒక రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..! వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం.. ఆ రాష్ట్రం మరెక్కడో కాదు..ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రలలో ఒకటైన సిక్కిం.
సిక్కిం తూర్పు హిమాలయ లోయలో ఉంది. నిటారుగా ఉన్న వాలులు, లోతైన లోయలు, తరచుగా కొండచరియలు విరిగిపడటం, భూకంపం సంభవించే జోన్ కాబట్టి, రైల్వే నిర్మాణం చాలా కష్టతరం. ఒక కిలోమీటరు రైల్వే లైన్ వేయడానికి సాధారణ ఖర్చు కంటే 8–10 రెట్లు ఖర్చవుతుంది. సిక్కిం పూర్తిగా వేరు కాలేదు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని సెవోక్-రాంగ్పో రైల్వే లైన్‌పై పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. 45 కి.మీ. పొడవైన ఈ లైన్‌లో 14 సొరంగాలు, 22 వంతెనలు ఉంటాయి. 86శాతం మార్గం సొరంగంగా ఉంటుంది. ఈ రైలు 2025–26 నాటికి రాంగ్పో చేరుకుంటుందని భావిస్తున్నారు. అయితే, గాంగ్‌టాక్‌కు రైలు ఇంకా చాలా దూరంలో ఉంది.
రైళ్లు లేకుండా రవాణా ఎలా జరుగుతుంది..?
సిక్కిం మంచి రోడ్ నెట్‌వర్క్, హెలికాప్టర్ సర్వీస్, ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్లపై ఆధారపడుతుంది. రాజధాని గ్యాంగ్‌టక్ బాగ్డోగ్రా విమానాశ్రయం, NJP రైల్వే స్టేషన్ నుండి కేవలం 4–5 గంటల డ్రైవ్ దూరంలో ఉంది. పాక్యోంగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కూడా అతి చేరువలో అందుబాటులో ఉంటుంది.
రైల్వే స్టేషన్ లేనప్పటికీ సిక్కిం భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఖాంగ్‌చెండ్‌జోంగా శిఖరం దివ్య దృశ్యం, సోమ్‌గో సరస్సు నీలి జలాలు, గురుదంగ్మార్ సరస్సు, ప్రశాంతత, యుమ్తాంగ్ లోయ అసమాన సౌందర్యం, ఇవన్నీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. సిక్కిం ఇప్పటికీ భారతదేశంలో రైల్వే రహిత రాష్ట్రం. కానీ, రైల్వే సౌకర్యం లేని సిక్కిం.. దాని అసమానమైన సహజ సౌందర్యం, సంస్కృతి, దాని పర్యాటకుల ఆతిథ్యంతో నిండి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..