AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒంటికాలిపై సిమెంట్‌ బస్తాలు మోస్తోన్న వ్యక్తి.. హ్యాట్సాఫ్‌ చెబుతోన్న నెటిజన్స్‌.. వైరల్‌ వీడియో

Viral Video:  ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడుగా ఉంటే ఎలాంటి అడ్డంకులైనా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రపంచం ముందు మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అందుకోసం మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Viral Video: ఒంటికాలిపై సిమెంట్‌ బస్తాలు మోస్తోన్న వ్యక్తి.. హ్యాట్సాఫ్‌ చెబుతోన్న నెటిజన్స్‌.. వైరల్‌ వీడియో
Disabled Man
Basha Shek
|

Updated on: Jul 28, 2022 | 9:20 PM

Share

Viral Video:  ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడుగా ఉంటే ఎలాంటి అడ్డంకులైనా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రపంచం ముందు మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అందుకోసం మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు మన చుట్టుపక్కల ఉండే కొందరు వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తాజాగా వీల్‌చైర్లో కూర్చొని ఫుడ్‌ డెలివరీ విధులు నిర్వర్తిస్తున్న ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఎమోషనల్‌ అవుతున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మన పోరాటాన్ని శక్తిగా మార్చుకోవడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అంటారు. మన జీవితానికి అన్వయించుకోవడం అంతసులభమేమీ కాదు. అయితే నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఒకరికి కాలు లేదు. అయినా చేతి కర్రల సహాయంతో సిమెంట్ బస్తాలు మోస్తుండడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అతను చేస్తున్నదే చిన్నపని కావొచ్చు. కానీ ఈ వీడియో చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు, నిస్సహాయతతో ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ వ్యక్తి ధైర్యం ఒక మేలు కొలుపని భావించవచ్చు. ఈ వీడియోను టార్క్సాహిత్య అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ‘ధైర్యం ఉన్నవారికి దేవుడు కూడా అండగా నిలుస్తాడు. మన మట్టిలోనే ఏదో గొప్పతనం ఉంది’ అంటూ సిమెంట్ బస్తాలు మోస్తోన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ