Viral Video: రైలు పట్టాల మధ్యలో దివ్యాంగుడు..! వేగంగా వస్తున్న ట్రైన్.. ఏం జరిగిందంటే..?

Viral Video:అనుకోకుండా రైలుపట్టాల మధ్య పడిపోయిన దివ్యాంగుడిని ఓ వ్యక్తి రక్షించాడు. దీంతో అందరు అతడిని సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ సంఘటన

Viral Video: రైలు పట్టాల మధ్యలో దివ్యాంగుడు..! వేగంగా వస్తున్న ట్రైన్.. ఏం జరిగిందంటే..?
Train Tracks
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 8:23 PM

Viral Video:అనుకోకుండా రైలుపట్టాల మధ్య పడిపోయిన దివ్యాంగుడిని ఓ వ్యక్తి రక్షించాడు. దీంతో అందరు అతడిని సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు పెద్ద ప్రమాదం తప్పిందని కామెంట్ చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో ప్రతి ఒక్కరి జీవితంలో మానవత్వాన్ని తట్టి లేపుతోంది.

బుధవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్‌లో వీల్‌చైర్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు పట్టాల మధ్యలో పడిపోయాడు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి పట్టాల మధ్యలోకి దిగి కిందపడిన ఆ వ్యక్తిని లేపుతాడు. తన బలంతో నెమ్మదిగా ప్లాట్ ఫాంపైకి ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ ఉన్న ప్రయాణికులు ఇది గమనించి వారికి సాయం చేయడంతో ఇద్దరు ప్లాట్‌ ఫాంపైకి చేరుకుంటారు. ఇంతలో వేగంగా ట్రైన్ రావడం వీడియోలో గమనించవచ్చు.

అయితే ఆ దివ్యాంగుడిని రక్షించిన వ్యక్తిని అక్కడున్న ప్రయాణికులందరు అభినందించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రక్షించబడిన ఆ దివ్యాంగుడు అతడికి ధన్యవాదాలు తెలిపాడు. కొద్దిగా ఆలస్యమైనా వేగంగా వస్తున్న రైలు వారిని ఢీ కొట్టేది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది చూశారు. అయితే సోషల్ మీడియా యూజర్లు తమ ఆలోచనలను, అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. “ఎవరైనా రైలు వేగాన్ని తగ్గించడానికి స్టేషన్‌లోని రైలు సిబ్బంది వద్దకు పరిగెత్తి హెచ్చరిస్తే బాగుండేదని ఒక వినియోగదారు అన్నారు.

Hiring trends 2021: ఐటీ రంగంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపింది.? రానున్న రోజుల్లో ఉద్యోగాలను శాసించే అంశాలు ఏంటి..

Viral Video: నువ్వు ఎలుగుబంటివైతే నాకేంటి..? ఆ పిల్లి ధైర్యం చూడాల్సిందే..!

అనిల్ దేశ్ ముఖ్ కేసు.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సీబీఐ…