వరుడి మెడలో వధువు తాళి కట్టిన వేళ

వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనాదిగా భారతీయ సంప్రదాయంలో వస్తోన్న ఆచారం. అయితే కర్ణాటకలోని విజయపుర జిల్లాలో వరుడి మెడలో వధువు తాళి కట్టారు. నాలతవాడ గ్రామంలో సోమవారం జరిగిన రెండు వివాహాల్లో వధువులే తాళిని కట్టారు. ప్రభురాజ్‌కు అంకిత, అమిత్‌కు ప్రియా మూడు ముళ్లు వేశారు. ఇదేం వింత అంటూ ప్రశ్నించిన వారికి.. 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేది. దాన్ని మేము పునరుద్ధరించామంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ఇవే అసలుసిసలైన బసవణ్ణ […]

వరుడి మెడలో వధువు తాళి కట్టిన వేళ
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 2:10 PM

వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనాదిగా భారతీయ సంప్రదాయంలో వస్తోన్న ఆచారం. అయితే కర్ణాటకలోని విజయపుర జిల్లాలో వరుడి మెడలో వధువు తాళి కట్టారు. నాలతవాడ గ్రామంలో సోమవారం జరిగిన రెండు వివాహాల్లో వధువులే తాళిని కట్టారు. ప్రభురాజ్‌కు అంకిత, అమిత్‌కు ప్రియా మూడు ముళ్లు వేశారు. ఇదేం వింత అంటూ ప్రశ్నించిన వారికి.. 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేది. దాన్ని మేము పునరుద్ధరించామంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ఇవే అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని విమర్శకుల నోళ్లు మూయించారు. ఇక ఈ వినూత్న వివాహ వేడుకలకు ఆధ్యాత్మికవేత్తలు ఇల్‌కల్ గురుమహంతేశస్వామి, చిత్రదుర్గ బసవమూర్తి, లింగుస్గూరు సిద్ధలింగ స్వామి తదితరులు హాజరు అవడం విశేషం.