ఇకపై దగ్గు మందు కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కలుషిత కాఫ్ సిరప్‌ల వల్ల చిన్నారుల మరణాలు, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ అలర్ట్ నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకొచ్చారు. కాఫ్ సిరప్‌ల తయారీ, అమ్మకం, కొనుగోళ్లపై కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి.