AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ కుక్కను పెంచుకోవాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్‌ కట్టాల్సిందే..! ఎంతంటే..

ప్రభుత్వం పన్ను విధిస్తున్నప్పటికీ కుక్కల పెంపకంపై మోజు తగ్గలేదు. ప్రజలు సంతోషంగా ఈ పన్ను చెల్లించి తమ పెంపుడు జంతువులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెంపుడు జంతువులను ప్రజలు బాధ్యతాయుతంగా ఉంచుకోవాలని, వాటి సంరక్షణలో ఎలాంటి లోటు రాకుండా ఉండేలా కూడా ఈ నిబంధనను రూపొందించారు.

ఇక్కడ కుక్కను పెంచుకోవాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్‌  కట్టాల్సిందే..! ఎంతంటే..
Pet Tax Hundesteuer
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2024 | 11:51 AM

Share

భారతదేశంలో కుక్కను పెంచుకోవాలంటే ప్రత్యేక పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కుక్కను పెంచుకోవాలంటే పన్ను చెల్లించాల్సిన కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఒక ప్రముఖ పేరు జర్మనీ. జర్మనీలో కుక్కను పెంచుకుంటే తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందే. ఈ పన్నును జర్మనీ స్థానిక భాషలో హుండేస్టౌర్‌ అంటారు. జర్మనీలో కుక్కలను పెంచుకునే పౌరులు ప్రతి సంవత్సరం ఈ పన్నును నిర్ణీత మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాలి. కుక్కల సంఖ్య, వాటి పెంపకం పరిస్థితులను బట్టి ఈ పన్ను మారుతుంది.

జర్మనీలో కుక్కల పెంపకంపై పన్ను వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది. 2023 సంవత్సరంలో జర్మన్ ప్రభుత్వం కుక్కల పెంపకందారుల నుండి సుమారు 421 మిలియన్ యూరోలు సంపాదించింది. దీనిని భారతీయ కరెన్సీగా మార్చినట్లయితే, ఈ మొత్తం రూ. 38 బిలియన్లకు పైగా ఉంటుంది.

అదే సమయంలో 2022 సంవత్సరంలో కుక్కల పెంపకం నుండి ప్రభుత్వానికి 414 మిలియన్ యూరోల పన్ను వచ్చింది. ఇది కాకుండా, గత దశాబ్దం 2013- 2023 మధ్య కుక్కల పెంపకంపై పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 41శాతం పెరుగుదల ఉంది. జర్మనీలో కుక్కల పెంపకం ధోరణి వేగంగా పెరుగుతోందని ఈ డేటా ద్వారా స్పష్టమైంది. కుక్కల పెంపకంపై పన్నులు చెల్లిస్తున్నా ప్రజలు వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి

జర్మనీలో కుక్కల యజమానుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ప్రభుత్వం పన్ను విధిస్తున్నప్పటికీ కుక్కల పెంపకంపై మోజు తగ్గలేదు. ప్రజలు సంతోషంగా ఈ పన్ను చెల్లించి తమ పెంపుడు జంతువులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెంపుడు జంతువులను ప్రజలు బాధ్యతాయుతంగా ఉంచుకోవాలని, వాటి సంరక్షణలో ఎలాంటి లోటు రాకుండా ఉండేలా జర్మనీలో కూడా ఈ నిబంధనను రూపొందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్