దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళ ఒకే కాన్పులో ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించిందంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచ మీడియాలో సైతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అసలు ఇది ఎంతవరకు నిజమని కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఈ వార్తపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పందిస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
ప్రిటోరియా నగరంలోని అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రికార్డులన్నింటిని అక్కడి ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. జూన్ 7వ తేదీన గోసియమి అనే మహిళ 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు వారికి ఏ ఆసుపత్రిలోనూ సమాచారం దొరకలేదు. అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా ఓ ప్రెస్ నోట్‌ను కూడా రిలీజ్ చేసింది. మరి ఇంతకీ ఆ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనివ్వడం అసలు నిజమా.? కాదా.? అనేది విషయంపై మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు.
GAUTENG GOVERNMENT RESPONDS TO PUBLIC ENQUIRY ON THE BIRTH OF DECUPLETS pic.twitter.com/BbE7fatchj
— GautengGov (@GautengProvince) June 9, 2021
అంతకముందు దక్షిణాఫ్రికాలోని మీడియా సంస్థ ఐఓఎల్.. జూన్ 7వ తేదీన గోసియమి తమారా సితోలే ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిన్చి ప్రపంచ రికార్డు సృష్టించిందని.. గతంలో ఈ రికార్డు మలియన్ హలీమా సిస్సే( పేరిట ఉండేదని పేర్కొంది. మే నెలలో మొరాకోకు చెందిన మలియన్ హలీమా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, సితోలే నగరంలో ఉన్న రిటైల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె గతంలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వారి వయసు ఆరేళ్లు.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!