Cab Driver : వావ్‌.. ఇది క్యాబా లేక సూపర్‌ మార్కెట్టా..? కారులోనే సకల సౌకర్యాలు.. అన్ని ఫ్రీ..

|

Jul 03, 2023 | 11:07 AM

ఇక, అబ్దుల్‌ఖాదిర్‌ క్యాబ్‌లో.. మినరల్ వాటర్, కూల్‌ డ్రింక్స్‌, అవసరమైన మందులు, బిస్కెట్లు, పెర్ఫ్యూమ్‌లు, న్యూస్‌పేపర్లు, మాస్క్‌లు, షూ పాలిష్, డస్ట్‌బిన్‌లు, గొడుగులు వంటి అనేక వస్తువులు ఈ క్యాబ్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే..

Cab Driver : వావ్‌.. ఇది క్యాబా లేక సూపర్‌ మార్కెట్టా..? కారులోనే సకల సౌకర్యాలు.. అన్ని ఫ్రీ..
Cab Driver
Follow us on

మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం అద్భుతంగా మారుతుంది. అయితే, డ్రైవర్లు సమయానికి చేరుకోవడం లేదని, కారు ఏసీ ఆన్ చేయకపోవడం, అదనంగా డబ్బులు కూడా అడుగుతున్నారని ప్రయాణికులనుంచి తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ, సోషల్ మీడియాలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఫోటో వైరల్‌ అవుతోంది. అతడి క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికుల జర్నీ హ్యాపీగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అవును, అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి ఢిల్లీలో క్యాబ్‌లు నడుపుతాడు. అతని కారులో మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. అవును, ఇందులో మీకు కావాల్సిన స్నాక్స్‌, కూల్‌డ్రింక్స్‌ నుండి వైఫై, వార్తాపత్రిక మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయి.

ఇలాంటి మరెన్నో సదుపాయాలు కలిగిన కారు ఫోటోను జూన్ 26న శ్యామ్ లాల్ యాదవ్ (@RTIExpress) అనే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌లో ఈ రోజు నేను ‘ఉబర్’ని ఉపయోగిస్తున్నాను అని రాశాడు. ఒక అద్భుతమైన డ్రైవర్‌ను కలిశాడు. అతని పేరు అబ్దుల్ ఖాదిర్. అతడికి 48 ఏళ్లు. అతను గత 7 సంవత్సరాలలో ఏ రైడ్‌ను క్యాసిల్‌ చేయలేదు. అతని కారులో చాలా రకాల సదుపాయలు ఉన్నాయి. అవును, ప్రమాద సమయంలో అవసరమైన ఫస్ట్‌ఎయిడ్‌ మొదలు..రైడర్‌లకు అవసరమైన అనేక వస్తువులు ఉన్నాయి. అంతేకాదు..అబ్దుల్ వాటికి ఎలాంటి అదనపు ఛార్జీని వసూలు చేయరు. అంతేకాదు..వెనుకబడిన పిల్లల కోసం క్యాబ్‌లో డొనేషన్ బాక్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 56 వేలకు పైగా వీక్షణలు, దాదాపు వెయ్యి లైక్‌లు వచ్చాయి. అలాగే క్యాబ్ డ్రైవర్‌పై యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక, అబ్దుల్‌ఖాదిర్‌ క్యాబ్‌లో.. మినరల్ వాటర్, కూల్‌ డ్రింక్స్‌, అవసరమైన మందులు, బిస్కెట్లు, పెర్ఫ్యూమ్‌లు, న్యూస్‌పేపర్లు, మాస్క్‌లు, షూ పాలిష్, డస్ట్‌బిన్‌లు, గొడుగులు వంటి అనేక వస్తువులు ఈ క్యాబ్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. అబ్ధుల్‌ ఖాదిర్ ఇక్కడ ఒక నోటీస్‌ ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం.. – మేము ప్రతి మతానికి చెందిన వారిని గౌరవిస్తాము. ధరించే దుస్తుల ఆధారంగా మనం ఏ మతమైనా గుర్తించవచ్చు. కానీ, అన్ని మతాల వారిని సమానంగా చూడాలి. మనం ఒకరినొకరు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. సమాజానికి మేలు చేసే వారి నుండి స్ఫూర్తి పొందాలి. ఇవన్నీ పాటిస్తేనే క్యాబ్‌లోని అన్ని సౌకర్యాలు పూర్తిగా ఉచితం. దీనికి వై-ఫై సౌకర్యం కూడా ఉంది.ప్రస్తుతం ఈ సూపర్‌ మార్కెట్‌ని పోలిన ఆటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..