Delhi : యమునా నదిలో స్నానం చేస్తే అంతే సంగతులు..! నదిలో మునిగి ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సవాల్ విసురుతూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా బుధవారం యమునా నదిలో స్నానం చేశారు. ఐటిఒ ఛత్ ఘాట్ వద్ద యమునా నదిలో స్నానానికి రావాల్సిందిగా ఆయన మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సిఎం అతిషిని ఆహ్వానించారు. సీఎం, మాజీ సీఎం కూర్చోవడానికి బీజేపీ రెడ్‌కార్పెట్‌పై రెండు కుర్చీలు కూడా వేసింది. యమునా నదిలో స్నానం చేసిన సచ్‌దేవ ఆరోగ్యం క్షీణించింది. అతను చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, శ్వాస […]
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సవాల్ విసురుతూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా బుధవారం యమునా నదిలో స్నానం చేశారు. ఐటిఒ ఛత్ ఘాట్ వద్ద యమునా నదిలో స్నానానికి రావాల్సిందిగా ఆయన మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సిఎం అతిషిని ఆహ్వానించారు. సీఎం, మాజీ సీఎం కూర్చోవడానికి బీజేపీ రెడ్‌కార్పెట్‌పై రెండు కుర్చీలు కూడా వేసింది. యమునా నదిలో స్నానం చేసిన సచ్‌దేవ ఆరోగ్యం క్షీణించింది. అతను చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా దేశరాజధాని ఢిల్లీ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా యమునా నదిలో విషపూరితమైన నురగ కాలుష్యానికి కారకంగా తెలుస్తోంది. విషపూరితమైన నురగ ఎలాంటి కాలుష్యం ఉందో.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా చేసిన ప్రయత్నం.. ఆయనను ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. యమునా నదిలో స్నానం చేసిన రోజు తరువాత ఆయన స్కిన్ అలర్జీకి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
వీరేంద్ర సచ్‌దేవా తీవ్ర దురదతో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నారని ఢిల్లీ బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇంతకు ముందు అతనికి అలాంటి జబ్బు లేదు. అంతకుముందు గురువారం కూడా, సచ్‌దేవా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందితో బాధపడుతున్నారని బిజెపి తెలిపింది. అతడిని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ మళ్లీ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడ క్లిక్ చేయండి..
दिल्ली भाजपा अध्यक्ष श्री @Virend_Sachdeva ने आज दिल्ली सरकार के 8500 करोड़ रुपए के Yamuna सफाई घोटाले को उजागर करते हुए यमुना मईया में डुबकी लगा कर दिल्ली सरकार की गलतियों के लिए क्षमा प्रार्थना की थी।
दोपहर बाद से श्री वीरेन्द्र सचदेवा को त्वचा में लाल रैशिस, खुजली एवं सांस… pic.twitter.com/lwnMTidh4z
— BJP Delhi (@BJP4Delhi) October 24, 2024
యమునా ప్రక్షాళన విషయంలో గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సచ్‌దేవా సవాల్ చేస్తున్నారు. 2025 నాటికి యమునాని శుభ్రం చేస్తానని గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం హామి ఇచ్చింది. దానిని నేర్చలేదని ఆరోపిస్తూ.. సచ్ దేవా యమునాలోని కాలుష్యాన్ని తెలిపేందుకు అందులో స్నానం చేసి ఆసుపత్రి పాలయ్యారు. యమునా నది శుద్ధికి ఉద్దేశించిన నిధులను ఆప్ ప్రభుత్వం కాజేసిందని.. కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు 2025 ఛత్ పూజకు ముందు దానిని శుభ్రం చేస్తానని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామి ఇచ్చిన విషయాలను కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..