Viral Video: చిరుత జింకని చూసిందంటే వేట తప్పదు.. కానీ ఇక్కడ జరిగింది చూస్తే షాక్ అవుతారు..!
Viral Video: అడవి ప్రపంచం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇక్కడి లెక్కలు ఎవ్వరికి అర్థం కావు. వేట జంతువులకి
Viral Video: అడవి ప్రపంచం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇక్కడి లెక్కలు ఎవ్వరికి అర్థం కావు. వేట జంతువులకి ఏదైనా సాధారణ జీవి కనిపిస్తే అంతే సంగతులు. ఆ రోజుకి అది ఆహారం అయిపోవాల్సిందే. అందుకే అడవిలోని జంతువులన్ని వేట జంతువులకి దూరంగా ఉంటాయి. ఒకవేళ వాటికి కనిపిస్తే వెంటనే పరుగెత్తుతాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది చూస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిరుతపులి నీటి గుంటలో నీరు తాగడం మనం చూడవచ్చు. కానీ అదే గుంటలో రెండు జింకలు కూడా నీరు తాగుతుండటం మనం గమనించవచ్చు. అడవిలో అత్యంత ప్రమాదకరమైన చిరుతపులి ముందు జింకలు ఎటువంటి భయం లేకుండా నీరు తాగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు చిరుత కూడా వాటిమీద ఎటువంటి దాడి చేయదు. ప్రశాంతంగా మూడు కలిసి నీరు తాగడాన్ని ఆస్వాదిస్తుంటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్లతో వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ వీడియోని ఐఎఫ్ఎస్ సుశాంత్ నందా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి అతను క్యాప్షన్ కూడా రాశాడు. అడవిలో ఉండే వేట జంతువులు ఇతర జంతువులని ఊరికే చంపవు. వాటికి ఆకలి అయినప్పుడు మాత్రమే వేటాడుతాయని చెప్పాడు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోని 45 వేల మందికి పైగా చూశారు. 2200 మందికి పైగా లైక్ చేసారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
“Wild animals never kill for sport..”#wildlife #nature ~James Anthony Froude
VC: WA forward@susantananda3 pic.twitter.com/42y3qUi1aJ
— Surender Mehra IFS (@surenmehra) May 15, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి