Viral: శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. కట్ చేస్తే.. అంతలోనే.!

|

Oct 23, 2024 | 5:01 PM

కెంటుకీలో 36 ఏళ్ల థామస్ అనే వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ తో మరణించినట్లు భావించి ఆర్గాన్ డొనేషన్ కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుండగా, గుండెను తీసే సమయంలో అతను అకస్మాత్తుగా లేచాడు. ఈ ఘటన వైద్యరంగంలో సంచలనం సృష్టించింది. ఇది గతంలో జరిగినప్పటికీ..

Viral: శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. కట్ చేస్తే.. అంతలోనే.!
Viral
Follow us on

అప్పుడప్పుడూ డాక్టర్లను షాక్‌కు గురి చేసే సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం మనం తరచూ ఇంటర్నెట్‌లో చూస్తూనే ఉంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన యూఎస్ఏలో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా.. ఒక్కసారిగా అతను లేచాడు. ఈ ఘటన 2021వ సంవత్సరంలో కెంటకీ నగరంలో జరిగినప్పటికీ.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా

వివరాల్లోకి వెళ్తే.. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. మొదటిగా అతడి శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో.. బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఆర్గాన్ డొనేషన్‌లో భాగంగా.. ఆ వ్యక్తి అవయవాలను చెక్ చేసేందుకు పరీక్ష చేయగా.. అతనిలో కదలిక, కళ్లలోంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేశారు. అతడి శరీరంలోనుంచి గుండెను తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత సదరు పేషెంట్ తన చేతులను టేబుల్‌కేసి కొట్టుకోవడం.. ఏడవడం లాంటివి చేశాడని తెలుస్తోంది. ఇక ఈ కేసు అటు వైద్య రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..