AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంత క్యూట్ కచ్చ బాదం డ్యాన్స్‌ను మీరెప్పుడు చూసి ఉండరు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: సోషల్‌ మీడియా (Socila Media) పుణ్యామాని ఏది, ఎప్పుడు వైరల్‌ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు...

Viral Video: ఇంత క్యూట్ కచ్చ బాదం డ్యాన్స్‌ను మీరెప్పుడు చూసి ఉండరు.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Narender Vaitla
|

Updated on: Mar 14, 2022 | 4:38 PM

Share

Viral Video: సోషల్‌ మీడియా (Socila Media) పుణ్యామాని ఏది, ఎప్పుడు వైరల్‌ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఒక్క రోజులో సెలబ్రెటీ హోదాను సంపాదించుకుంటున్నారు. అంతేనా మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరియం చేస్తుంది సోషల్‌ మీడియా. ప్రపంచంలో ఏ మూలన ప్రతిభ దాగి ఉన్న దానిని క్షణాల్లో ప్రపంచానికి చూపిస్తోంది. ఇలా రోజుకో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నెట్టింట్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోన్న వీడియోల్లో కచ్చ బాదం ఒకటి. పల్లీలు అమ్ముకునే ఓ చిన్న వ్యాపారిని ఈ పాట ఒక్క సారిగా సెలబ్రిటీని చేసేసింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ బద్యాకర్ అనే ఓ చిరు వ్యాపారి తన పల్లీలు అమ్ముకునే క్రమంలో కచ్చ బాదం అంటూ పాడిన పాట ఇప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు డీజే టచ్‌ ఇచ్చి ఏకంగా అతన్ని ఓ సింగర్‌ను చేశేశారు. ఇదిలా ఉంటే కచ్చ బాదం డీజే వెర్షన్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ మాములుగా ఉండడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కచ్చా బాదం పాటకు కాలు కదిపి నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే తాజాగా కచ్చ బాదంకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓ చిన్నారి కచ్చ బాదంకు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐదేళ్లు కూడా నిండని ఈ చిన్నరి వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటిని షేక్‌ చేస్తోంది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన అవనీష్‌ శరన్‌ అనే ఐఎఎస్‌ ఆఫీసర్‌.. ‘క్యూటెస్ట్ కచ్చబాదం’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌ను మీరూ చూసేయండి…

Also Read: ICMR – NIE Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. ఎన్‌ఐఈలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

Digitally for Scrapping: పాత వాహనదారులకు ముఖ్య సూచన.. స్క్రాపేజ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం

Holi Festival: మొదలైన హొలీ సందడి.. ప్రయాగ్‌రాజ్‌లో మోడీ మాస్కులకు అత్యధిక డిమాండ్