భయం, భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండిటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. అదే ఓస్కూరీ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇందులోకి అడుగు పెట్టగానే వేలాది అస్తిపంజరాలు స్వాగతం పలుకుతాయి. యూరప్ దేశమైన చెక్ రిపబ్లిక్ కుట్నాహోరాలోని సెడ్లెక్‌లోఈ చర్చ్ ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది.
1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా కు పంపాడు. గోల్గోతా అంటే.. సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. అప్పటినుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది.
ఆ వ్యాధికి 30వేల మంది పైనే మృతి చెందారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.