Viral Video: వీడు మాములోడు కాదు.. చిక్కినట్టే చిక్కి చుక్కలు చూపించాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
తాజాగా ఓ దొంగ పోలీసులకు దొరికినట్టే దొరికాడు.. కానీ అంతలోనే చటుక్కున పారిపోయాడు.. క్షణకాలంలో పోలీసులను ముప్పు తెప్పలు పెట్టాడు ఓ దొంగ.
దొంగలను పట్టుకోవడానికి పోలీసులు చాలా సందర్భాల్లో చాకచక్యంగా ప్రవర్తిస్తుంటారు. తమ తెలివితో అనేక ప్లాన్స్ వేసి దొంగలను పట్టేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ చిక్కకుండా పారిపోతుంటారు దొంగలు. చిక్కినట్టే చిక్కి.. అంతలోనే కళ్ల ముందు నుంచి వెళ్లిపోతారు. తాజాగా ఓ దొంగ పోలీసులకు దొరికినట్టే దొరికాడు.. కానీ అంతలోనే చటుక్కున పారిపోయాడు.. క్షణకాలంలో పోలీసులను ముప్పు తెప్పలు పెట్టాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో.. బైక్ పై ఓ దొంగ పారిపోతుండగా.. అతని వెనకాలే మరో బైక్ పై ఇద్దరు పోలీసులు వెంబడిస్తున్నారు. అలా కొద్దిదూరం వెళ్లగానే ఆ దొంగ తన బైక్ వేగం తగ్గిస్తూ.. తాను బైక్ ఆపుతున్నట్లు పోలీసులకు సైగ చేశాడు. ఆ తర్వాత దొంగ బైక్ ఆపగానే.. పోలీసులు సైతం తమ బైక్ ఆపి.. అతడిని పట్టుకోవడానికి కింద దిగారు. దీంతో సెకను వ్యవధిలో అప్రమత్తమైన ఆ దొంగ బైక్ స్టార్ట్ చేసి.. పోలీసుల ముందు నుంచే యూటర్న్ చేసుకుని పారిపోయాడు..వెనక నుంచి మరో పోలీసు బైక్ పై రావడంతో అతడిని దారి మల్లించాడు ఆ దొంగ. దీంతో వెనక వచ్చిన పోలీసులు పక్కనే ఉన్న పొదల్లో పడిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. బాలీవుడ్ ధూమ్ సినిమాను చూసినట్టు ఉందని.. స్మార్ట్ దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
View this post on Instagram