AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సైకిల్ నేర్చుకునే వయసులో ఫ్రెండ్స్‌తో కలిసి స్కూటర్ నడుపుతున్న బాలుడు..

పిల్లలకు తాము చేస్తున్న పని తమకు హాని .. లేదా తమ వల్ల ఇతరులకు ఏ విధమైన హాని కలుగుతుందా అనే అవగాహన వారికి తెలియదు. అయితే పిల్లల చేసే పనులు కొన్ని చూస్తే ముద్దోస్తాయి.. అదే సమయంలో నెట్టింట్లో పిల్లలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయినప్పుడల్లా.. అవి త్వరగా పాపులర్ కావడానికి ఇదే కారణం. ప్రస్తుతం కూడా ఓ చిన్నారి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. అది చూసిన తర్వాత ఎవరికైనా తమ బాల్యం గుర్తుకొస్తుంది.

Viral Video: సైకిల్ నేర్చుకునే వయసులో ఫ్రెండ్స్‌తో కలిసి స్కూటర్ నడుపుతున్న బాలుడు..
Viral Video
Surya Kala
|

Updated on: Jun 17, 2024 | 8:32 PM

Share

నేటి జనరేషన్ లో పిల్లలు సూపర్ ఫాస్ట్.. కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నారు అని చెప్పవచ్చు. ఆలోచనల్లో, తెలివి తేటల్లో పెద్దలకు ఎ మాత్రం తక్కువ కాము అన్న చందంగా ఉంటున్నారు కొంతమంది పిల్లలు. పెద్దలు చేసే పనులు అన్నీ పిల్లలే చకచకా చేస్తారు. అయితే పిల్లలకు తాము చేస్తున్న పని తమకు హాని .. లేదా తమ వల్ల ఇతరులకు ఏ విధమైన హాని కలుగుతుందా అనే అవగాహన వారికి తెలియదు. అయితే పిల్లల చేసే పనులు కొన్ని చూస్తే ముద్దోస్తాయి.. అదే సమయంలో నెట్టింట్లో పిల్లలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయినప్పుడల్లా.. అవి త్వరగా పాపులర్ కావడానికి ఇదే కారణం. ప్రస్తుతం కూడా ఓ చిన్నారి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. అది చూసిన తర్వాత ఎవరికైనా తమ బాల్యం గుర్తుకొస్తుంది.

టీనేజ్ పిల్లలు రోడ్లపై బైక్‌లు లేదా స్కూటర్‌లు నడపడం చాలాసార్లు చూసి ఉంటారు. ఇలా పిల్లలు రోడ్డు మీద ప్రయాణించినప్పుడు.. ముందు బైకర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు బైక్ నడపడానికి పూర్తిగా సిద్ధంగా ఉండరు. ఈ కారణంగా రహదారిపై పిల్లలు వాహనాలు నడుపుతున్న సముయంలో ప్రమాదం జరుగుతుందని ప్రయాణీకులకు తెలుసు. ఇప్పుడు 10-12 ఏళ్ల చిన్నారి తన స్నేహితులను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ చిన్నారి స్కూటర్‌పై ఆనందంగా నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ పిల్లవాడి పాదాలు నేలను తాకడం లేదు. అయితే ఆ బాలుడు స్కూటర్‌ను నడపడానికి ప్రయత్నించడమే కాకుండా తన స్నేహితులను కూడా స్కూటర్ పై కూర్చునేలా చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పిల్లవాడు ప్రమాదం గురించి అస్సలు భయపడినట్లు కనిపించడం లేదు. అక్కడ ఉన్న అతని స్నేహితులు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ వీడియోను aryantyagivlogs అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేసారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను వేలాది మంది చూసి లైక్ చేసారు. దీనితో పాటు.. పలువురు నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘ఈ పద్ధతిలో రోడ్డుపై నడపడం చాలా ప్రమాదకరం.’ ‘ఇలాంటి పిల్లల తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మరొకరు కామెంట్ చేయగా.. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందిస్తూ.. పిల్లల డ్రైవింగ్ కోసం బైక్ ఇచ్చిన తల్లిదండ్రులను తప్పు పడుతూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..